హైదరాబాదీ క్రికెటర్ అంబటి  రాయుడుకి బీసీసీఐ స్వల్ప ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది.  ప్రపంచకప్‌ కోసం స్టాండ్‌బై ప్లెయర్లుగా ప్రకటించింది. రాయుడితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ లను కూడా స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో ఉంది. ప్రస్తుతం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్‌ వెళ్లే విమానం ఎక్కుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాట్స్ మెన్ స్టాండ్ బైగా అంబటి రాయుడు.. వికెట్ కీపర్ స్టాండ్ బై గా రిషభ్‌ పంత్‌,  బౌలర్ స్టాండ్ బైగా సైనీ బౌలర్ల జాబితాలో ఉన్నాడు. అంటే సెలక్ట్ చేసిన వారిలో ఎవరైన బ్యాట్స్ మెన్ గాయపడితేనే రాయుడికి అవకాశుముంటున్నమాట. ఫెర్మామెన్స్ ఆధారంగా కాకుండా అదృష్టంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది


తెలుగుతేజం అంబటి రాయుడిని  ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో సెలక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. సీనియన్లు సునీల్‌ గావస్కర్‌, గౌతమ్‌ గంభీర్‌ సహా మరికొందరు మాజీలు వీరికి అండగా నిలిచారు. తాజా విమర్శల నేపథ్యంలో స్టాండ్ బై గా ప్రకటించి బీసీపీఐ  విమర్శల ధాటిని తగ్గించుకుంది.