Mohammad Wasim: ఆసియా కప్ 2022లో ప్రత్యర్ధి దేశాలు రెండూ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు గాయాలు వెంటాడుతున్నాయి. మరో పేస్ బౌలర్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ 2022 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 27న యూఏఈలో ప్రారంభం కానుండగా..ఆగస్టు 28న ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. రెండు దాయాది దేశాలు గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తరువాత ఇదే తలపడటం. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు ఘోర పరాజయం ఎదురైంది. అందుకే ఇప్పుడు టీమ్ ఇండియా పటిష్టమైన జట్టుతో సిద్ధమై..ప్రతీకారం కోసం సన్నాహాలు చేస్తోంది. 


అదే సమయంలో పాకిస్తాన్ జట్టుకు మాత్రం గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టాప్ క్లాస్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి దూరమయ్యాడు. ఇది పాకిస్తాన్ జట్టుకు పెద్ద లోటే. ఎందుకంటే 2021 టీ20 ప్రపంచకప్‌లో ఇండియా ఓటమికి ప్రధాన కారణం షహీన్ అఫ్రిదినే. షహీన్ అఫ్రిది లోటు నుంచి తేరుకునేలోగా పాకిస్తాన్ మరో పేస్ బౌలర్ గాయం బారినపడ్డాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ వాసిమ్ వీపులో నొప్పి కారణంగా ప్రాక్టీసు మధ్యలో వదిలేశాడు.


21 ఏళ్ల మొహమ్మద్ వాసిమ్‌ను గాయం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ కోసం పంపించారు. నిన్న ఐసీసీ అకాడమీలో జరిగిన నెట్ ప్రాక్టీసులో బ్యాక్ పెయిన్ అంటే వీపు నొప్పి ఉందని ఫిర్యాదు చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏ విధమైన రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే ముందు జాగ్రత్తగా స్కానింగ్ చేయిస్తున్నారు. 


మొహమ్మద్ వాసిమ్ ఇప్పటి వరకూ పాకిస్తాన్ తరపున 8 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలోనై అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన మొహమ్మద్ వాసిమ్ జట్టులో కీలకమైన పేస్ బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పుడీ పేస్ బౌలర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు షహీన్ అఫ్రిది వంటి ప్రసిద్ధ బౌలర్‌ను ఆసియా కప్ నుంచి దూరం పెట్టాల్సి వచ్చింది. 


Also read: Virat Kohli: టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి రిటైర్ కానున్నాడా, ఆ ట్వీట్‌కు అర్ధమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook