RCB Qualified Playoff: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే ఇది కదా. వరుస అపజయాలు.. పాయింట్ల పట్టికలో అథమ స్థానం.. ఇక ప్లేఆఫ్స్‌కు చేరుకోదని అందరూ నిశ్చయించుకున్న సమయంలో అత్యద్భుతంగా పుంజుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇంకా ఆట ముగిసిపోలేదని చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో నిరూపించింది. ఆ జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన బెంగళూరు విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కీలకమైన మ్యాచ్‌ అత్యంత భావోద్వేగభరితమైన వాతావరణంలో జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయం అనంతరం ఆర్‌సీబీ అభిమానులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఇక స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అయితే అతడి ఆనంధానికి అవధుల్లేవు. అతడి సతీమణి, హీరోయిన్‌ అనుష్క శర్మ అయితే ఒక విధంగా ఏడ్చేసింది. విజయం అనంతరం రెండు చేతులు పైకి లేపి భావోద్వేగానికి లోనయ్యింది. తన భర్త ఉన్న జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడంతో స్టాండ్స్‌లో నిలబడి సంబరాలు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Also Read: IPL RCB vs DC: ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ పని ఖతం


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం ఆర్‌సీబీ, చెన్నై మధ్య మ్యాచ్‌ జరిగింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. చివరికి ఆర్‌సీబీ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్‌లో ముందడుగు వేసింది. కీలకమైన మ్యాచ్‌ను చేజార్చుకున్న మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇంటి బాట పట్టింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే 18 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుతమే చేసింది. 27 పరుగులతో తిరుగులేని విజయం సాధించి ఐపీఎల్‌ ట్రోఫీ కోసం కీలక మైలురాయిని అధిగమించింది.

Also Read: IPL MI vs LSG: ముంబై ఇండియన్స్‌ అట్టర్ ప్లాప్‌ షో.. ఆఖరి మ్యాచ్‌లోనూ లక్నో చేతిలో చిత్తు


మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ విఫలమైనా మిగతా బ్యాటర్లు పరుగులు చేయడంతో భారీ లక్ష్యమే నిర్దేశించారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాటర్లు విఫలమవడంతో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి బాట పట్టింది. ఈ పరాజయంతో ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటికి వెళ్లడంతో చెన్నై అభిమానుల్లో తీవ్ర నిరాశ నింపింది.


బెంగళూరు సంబరాలు
ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ట్రోఫీని ముద్దాడని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి కూడా కప్‌ కొట్టదని భావించారు. ప్లేఆఫ్స్‌కు చేరకుంటే కప్‌ దూరమవుతుందని భావించిన బెంగళూరు ఆటగాళ్లు చెన్నై మ్యాచ్‌లో గొప్పగా ఆడారు. బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చారు. విజయం అనంతరం విరాట్‌ కోహ్లీ వీర విహారం అభిమానులందరిలోనూ భావోద్వేగానికి గురి చేసింది. చిన్నపిల్లాడిలా మారి బెంగళూరు ఆటగాళ్లు చేసుకున్న సంబరాలు టీవీల్లో చేస్తున్న ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది. ఇక స్టాండ్స్‌లో కూర్చున్న కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆనందభాష్పాలు రాల్చింది. విజయం అనంతరం పైకి లేచి ఎగిరి గంతేసింది. అనంతరం ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఒక విధంగా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఈసారి కప్‌ నమ్‌దేనా?
ఇంత గొప్పగా పోరాడిన బెంగళూరు ఈసారి తప్పక ట్రోఫీ సాధించాలని క్రికెట్‌ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఎప్పటి నుంచే ఉన్న 'కప్‌ నమ్‌దే' అనేది ఈ ఐపీఎల్‌లో సాకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కసితో మిగతా మ్యాచ్‌లు ఆడితే బెంగళూరు చిరకాల కల 'ఐపీఎల్‌ ట్రోఫీ' తప్పక దక్కుతుందని క్రికెట్‌ ప్రేమికులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. బుధవారం ప్లేఆఫ్స్‌ 2 బెంగళూరు ఆడనుంది. అయితే ఆర్‌సీబీకి ప్రత్యర్థి ఎవరో ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌ల్లో తేలనుంది.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter