Arrest Kohli Trends On Twitter After Virat's Fan Kills Rohit Sharma fan: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం కావాలని ప్రధాని నరేంద్ర మోడీకి వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం నెట్టింట అరెస్ట్ కోహ్లీ (#ArrestKohli) ట్రెండ్ అవుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమాని హత్య తర్వాత నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా కోహ్లీని అరెస్ట్ చేయాల్సిందే అంటున్నారు. విషయంలోకి వెళితే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూరు గ్రామానికి చెందిన ఎస్ ధర్మరాజ్, పి విగ్నేష్ మంచి స్నేహితులు. ఇద్దరూ క్రికెట్ అభిమానులు. ధర్మరాజ్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఐపీఎల్‌లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి కూడా అభిమాని. విగ్నేష్ ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్‌కి అభిమాని. అలానే రోహిత్ శర్మ అభిమాని కూడా. ధర్మరాజ్, విగ్నేష్ మధ్య అప్పుడప్పుడు కోహ్లీ-రోహిత్ శర్మ లేదా బెంగళూరు- ముంబై జట్ల గురించి సరదాగా వాగ్వాదం జరిగేది.


శుక్రవారం (అక్టోబర్ 14) రాత్రి ధర్మరాజ్, విగ్నేష్ ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. ఎప్పటిలానే ఇద్దరు క్రికెట్ గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది. విగ్నేష్ వెటకారంగా కోహ్లీ గురించి మాట్లాడాడు. ఇది తట్టుకోలేని ధర్మరాజ్.. ఆవేశంతో తన చేతిలో ఉన్న మద్యం సీసాతో విగ్నేష్ తలపై కొట్టాడు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న బ్యాట్‌ని తీసుకుని తలపై బాదాడు. దాంతో విగ్నేష్ అక్కడిక్కడే చనిపోయాడు.



ప్రస్తుతం ధర్మరాజ్, విగ్నేష్ గొడవ జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపుతోంది. ప్రపంచ క్రికెట్లో కూడా పెద్ద టాపిక్ అయింది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ 'అరెస్ట్ కోహ్లీ' అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు తమకు న్యాయం కావాలని ప్రధాని నరేంద్ర మోడీకి వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఇక టీ20 వరల్డ్‌కప్ 2022లో ఆడేందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. నేటి నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. 




Also Read: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!


Also Read: నేడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం.. బరిలోకి 16 జట్లు! మరిన్ని వివరాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook