Joe Root Injured in Practice session, Big Blow to England: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes) 2021లో భాగంగా అడిలైడ్ (Adelaide Test) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే పట్టు కోల్పోయిన ఇంగ్లండ్ (England)​కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. ఫాస్ట్ బౌలర్ విసిరిన బంతి అతడి పొత్తికడుపులో బలంగా తాకింది. దాంతో రెండో టెస్టు నాలుగో రోజైన ఆదివారం ఫీల్డింగ్ కోసం మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం రూట్‌కు అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. సెకండ్ ఇన్నింగ్స్​లో అతడు బ్యాటింగ్​కు దిగేది అనుమానంగా మారింది. ఇదే జరిగితే ఈ మ్యాచును కాపాడుకోవడం ఇంగ్లీష్ జట్టుకు కష్టమనే చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ గాయపడ్డాడు. బంతి అతడి పొత్తి కడుపులో బలంగా తాకింది. దాంతో అతడు ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం రూట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం కారణంగానే నాలుగో రోజు ఫీల్డింగ్​కు రాలేదు' అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఓ ప్రకటనలో వెల్లడించింది. సెకండ్ ఇన్నింగ్స్​లో రూట్ అవసరం తప్పనిసరి అయితే.. పెయిన్ కిల్లర్స్ సాయంతో బరిలోకి దిగనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఏదైనా మ్యాచ్ పరిస్థితిని బట్టి ఈసీబీ నిర్ణయం తీసుకోనుంది. 


Also Read: BB Telugu Grand Finale: BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో అదుర్స్...స్టేజ్ పై టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సందడి


అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ (England) ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులో పడింది. తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా (Australia) 9 వికెట్ల నష్టానికి 473 పరుగులకు డిక్లేర్డ్ చేయగా.. ఆపై రూట్ సేన కేవలం 236 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇప్పటికే ఆసీస్ ఆధిక్యం 400 పరుగులుగా ఉంది. కామెరూన్ గ్రీన్ (8), మార్నస్ లబుషేన్ (47) క్రీజులో ఉన్నారు. మ్యాచులో ఇంకా రోజున్నర మిగిలి ఉంది. రెండో సెషన్ తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఆపై భారీ లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. 


Also Read: Salman Butt: మిగతా దేశాలు అలా చెయ్యట్లేదు.. అందుకే టీమిండియా దూసుకెళుతోంది: పాక్ మాజీ కెప్టెన్




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook