Asia Cup 2003: ఈ నెల 21న ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. ఈ ప్లేయర్లు ఉంటారా..?
India Squad For Asia Cup 2023: ఆసియా కప్‌కు టీమిండియాను ఈ నెల 21న సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధం నెలకొంది. తిలక్ వర్మను ఎంపిక చేస్తారా..? లేదా..? సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇస్తారా..? అనేది చూడాలి.
India Squad For Asia Cup 2023: ప్రస్తుతం ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా ఉండగా.. ఆసియా కప్‌కు ప్లేయర్లను రెడీ చేసే పనిలో పడింది బీసీసీఐ. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 21న ఆసియా కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించనుంది. ఆగస్టు 30వ తేదీ నుంచి పాకిస్థాన్-శ్రీలంక వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానుంది. సోమవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది సెలక్షన్ కమిటీ. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాడు. సీనియర్లు, జూనియర్లతో కలిసి టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి జట్లు ఇప్పటికే తమ ఆసియా కప్‌కు టీమ్‌లను ప్రకటించగా.. ఆటగాళ్ల గాయాల సమస్యల కారణంగా భారత జట్టు ప్రకటనలో ఆలస్యం జరిగింది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇవ్వగా.. కేఎల్ రాహుల్ రీఎంట్రీ కూడా దాదాపు ఖాయమైంది. అయితే శ్రేయాస్ అయ్యర్ రాకపై సందిగ్ధత నెలకొంది. అయితే అయ్యర్ కూడా ఆసియా కప్ టోర్నీలో ఆడటం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. అయ్యర్ ఫిట్‌గా లేకపోతే.. తిలక్ వర్మను ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టులేకపోయిన సూర్యకుమార్ యాదవ్ ప్లేస్‌పై డౌట్ ఉంది.
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కరేబియన్ జట్టుపై టీ20 సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌లో కీరోల్ ప్లేచేశాడు. నాలుగోస్థానానికి సరిగ్గా సరిపోతానని నిరూపించుకున్నాడు. యువరాజ్ సింగ్ తరువాత ఆ తరహా బ్యాటింగ్ చేసే స్కిల్స్ తిలక్ వర్మలో కనిపిస్తున్నాయి. ఓ వైపు వికెట్ కాపాడుకుంటునే.. వేగంగా ఆడగల సత్తా ఈ హైదరాబాదీ కుర్రాడిలో ఉండడం కలిసి వచ్చే అంశం. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అదనపు స్పిన్నర్‌తో వెళతారా..? అదనపు బ్యాటర్‌ను తీసుకుంటారో చూడాలి.
Also Read: New LTC Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. ఈ 3 రూల్స్‌లో మార్పులు
Also Read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి