New LTC Rules For Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మూడు కొత్త నిబంధనలు మార్చింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ)కి సంబంధించి రైలు ప్రయాణ సమయంలో ఆహార ఖర్చు, ప్రభుత్వ ఖర్చుతో టిక్కెట్ బుకింగ్ గురించి కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు ఈ నెల 10వ తేదీనే ఆఫీస్ మెమోరండమ్ రిలీజ్ చేసింది. ఎల్‌టీసీకి అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎయిర్ ట్రావెల్, ట్రైన్ ట్రావెల్‌లకు సంబంధించి ఛార్జీలను ఎలా రీయంబర్స్ చేస్తారో తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం వేతనాలు అందజేస్తుంది. ఎల్‌టీసీ కింద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (అవసరమైన ప్రయాణ రాయితీ) 1988 ప్రకారం చెల్లిస్తోంది. DoPT కొత్త నిబంధనల గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి.
రైలు ప్రయాణంలో ఆహార ఛార్జీలు
ఎల్‌టీసీ ప్రయోజనం కోసం రైలులోని ఆహార ఛార్జీలను తిరిగి చెల్లించడానికి ఇప్పుడు ఉద్యోగులకు అనుమతించనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెల్లడించింది. ఉద్యోగులు ఎల్‌టీసీ కింద రైలులో ప్రయాణించి రైల్వే క్యాటరింగ్‌ను ఎంచుకున్న చోట వారికి తిరిగి చెల్లిస్తామని తెలిపింది.
ఎయిర్ టికెట్ బుకింగ్ నియమాలు
ఎల్‌టీసీ కింద విమాన టిక్కెట్‌ను బుక్ చేసి.. ఏదైనా కారణంతో దానిని రద్దు చేయాల్సి వస్తే విమానయాన సంస్థలు, ఏజెంట్ లేదా ప్లాట్‌ఫారమ్ కింద విధించిన క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా చెల్లిస్తామని డీఓపీటీ పేర్కొంది.
ఈ మూడు ట్రావెల్స్ కింద..
ఎల్‌టీసీ కింద విమానంలో ప్రయాణించడానికి అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఐఆర్‌సీటీసీ, బీఎల్‌సీఎల్, అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ అనే మూడు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కూడా టిక్కెట్‌లను తప్పనిసరిగా బుక్ చేసుకోవలసిన అవసరం లేదని DoPT నిర్ణయించింది. అతి తక్కువ మార్గానికి బస్సు లేదా రైలు ఛార్జీలు చెల్లిస్తామని పేర్కొంది. ఇక్కడ టిక్కెట్‌ను రద్దు చేస్తే, క్యాన్సిలేషన్ ఛార్జీని ఉద్యోగి భరించాల్సి ఉంటుందని తెలిపింది.
Also Read: Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?
Also Read: Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి