ఆసియా కప్‌ 2018లో భారత్‌, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది.ఈ ఆటలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ 238 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించడం జరిగింది. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లలో షోయబ్‌ మాలిక్‌ (78 పరుగులు) దుమ్మురేపగా.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ (44 పరుగులు), ఫకార్‌ జమాన్‌ (31 పరుగులు) ఫరవాలేదు అనిపించేలా ఆడడంతో..  ఆ జట్టు కాస్త చెప్పుకోదగ్గ స్కోరే చేయగలిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ను ఇండియన్ స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లు కట్టడి చేసి... తమ సత్తాను చాటారు. 55 పరుగులకే ఇమామ్‌ ఉల్‌ హక్‌(10), ఫకార్‌ జమాన్‌(31) లాంటి ఆటగాళ్లను భారత బౌలర్లు ఔట్ చేయడంతో పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడింది. పరిస్థితి చక్కదిద్దుతాడని భావించిన బాబర్‌ ఆజమ్‌(9) కూడా రన్ అవుట్ అవ్వడంతో వారి టీమ్ నిజంగానే డీలా పడిపోయింది. 58 పరుగులకే మూడు వికెట్లు అర్పించుకుంది.


ఈ సమయంలో షోయబ్ మాలిక్‌, సర్ఫరాజ్‌లు బాధ్యతను తమ భుజాలమీదకెత్తుకున్నారు. 64 బంతుల్లో మాలిక్‌ అర్థ సెంచరీ చేశాడు కూడా. ఒకానొక దశలో వీరి భాగస్వామ్యం భారత్‌కు ప్రమాదకరంగానే పరిణమించింది. అయితే కుల్దీప్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ (44) ఔట్ అవ్వడంతో మళ్లీ గేమ్ మారిపోయింది. మూడో వికెట్‌కు వారు చేసిన 107 పరుగులు స్కోరుకి కలిసొచ్చినా... మాలిక్‌, అసిఫ్‌ అలీలు ఔట్ కావడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అసిఫ్‌ అలీ(30)ని బౌల్డ్‌ చేసిన చహల్‌ వన్డేల్లో 50వ వికెట్ తీసి మళ్లీ సంచలనమయ్యాడు. ఆఖరి ఓవర్లో బుమ్రా షాదాబ్‌(10) కూడా అవుట్ కావడంతో.. పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది.