Asia Cup 2023 Schedule: ఇవాళ్టి నుంచి 19 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులకు పండుగే. ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో క్రికెట్ టోర్నీ అలరించనుంది. ఈసారి వన్డే ఫార్మట్‌లో జరగనున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి కాస్సేపట్లో పాకిస్తాన్ ముల్తాన్ స్డేడియం వేదికగా ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్ 2023ను పాకిస్తాన్ - శ్రీలంక దేశాలు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఇవాళ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ ఆసియా కప్ టోర్నీ జరగనుంది. మొత్తం 2 గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఉంటే..బి గ్రూపులో ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 1 మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో 4 పాకిస్తాన్‌లో , 9 శ్రీలంకలో జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్ కావడంతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో, ఇండియా ఆడనున్న మ్యాచ్‌లు శ్రీలంకలో జరగవచ్చు.


మరోవైపు ఇవాళ పాకిస్తాన్‌లోని ముల్తాన్ స్డేడియంలో ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్ని పాకిస్తాన్ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ సింగర్ అతీఫ్ అస్లంలతో భారీ ప్రదర్శన ఏర్పాటు కానుంది.


ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇలా


ఆగస్టు 30          ముల్తాన్ ( పాకిస్తాన్ ) లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్
ఆగస్టు 31          కాండీ ( శ్రీలంక) లో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
సెప్టెంబర్ 2      కాండీ ( శ్రీలంక) లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా
సెప్టెంబర్ 3      లాహోర్ ( పాకిస్తాన్) లో బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 4      కాండీ ( శ్రీలంక) లో ఇండియా వర్సెస్ నేపాల్
సెప్టెంబర్ 5      లాహోర్ ( పాకిస్తాన్) లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక


సూపర్ 4 దశ ఇలా


సెప్టెంబర్ 6       లాహోర్ ( పాకిస్తాన్) లో ఏ1 వర్సెస్ బీ2
సెప్టెంబర్ 9       కొలంబో ( శ్రీలంక)లో బీ1 వర్సె బీ2
సెప్టెంబర్ 10     కొలంబో ( శ్రీలంక)లో ఏ1 వర్సె ఏ2
సెప్టెంబర్ 12     కొలంబో ( శ్రీలంక)లో ఏ2 వర్సెస్ బి1
సెప్టెంబర్ 14     కొలంబో ( శ్రీలంక)లో ఏ1 వర్సెస్ బీ1
సెప్టెంబర్ 15     కొలంబో ( శ్రీలంక)లో ఏ2 వర్సెస్ బీ2


ఇక సెప్టెంబర్ 17న ఆసియా కప్ 2023 ఫైనల్ కొలంబో వేదికగా జరగనుంది.


Also read: Sanju Samson's Wife Charulatha: సంజూ శాంసన్, చారులత రమేష్ ఇంట్రెస్టింగ్ కాలేజ్ లవ్ స్టోరీ గురించి తెలుసా ?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook