Asia Cup 2023: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. చరిత్రలో తొలిసారి ఇలా.. పిక్ వైరల్..!
Pakistan Name On Indian Team Jersey: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు రానుంది. ఎందుకు అని అనుకుంటున్నారా..? ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో లోగో కింద పాక్ పేరు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Pakistan Name On Indian Team Jersey: భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే.. ఏ రేంజ్‌లో ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్డేడియంలో ఆటగాళ్లే కాదు.. రెండు దేశాల మధ్య కూడా ఎంతో ఉద్వేగభరితంగా ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో దయాదుల మధ్య పోరు వీక్షించేందుకు ఇప్పటికే అహ్మదాబాద్‌లో టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. అయితే అంతకు ముందే ఆసియా కప్‌లో టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడనుంది.
ఈ మ్యాచ్‌లకు సంబంధించి టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు రానుంది. కొత్త జెర్సీతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున భారత జెర్సీపై 'పాకిస్థాన్' అని రాసి ఉంటుంది. ఆసియా కప్ లోగో కింద పాకిస్థాన్ పేరు ఉంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టోర్నమెంట్‌లో గ్రూప్ దశలో భారత్ రెండుసార్లు చిరకాల ప్రత్యర్థితో తలపడనుంది. రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే.. మూడోసారి తలపడతాయి. ఈ సారి వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 30న ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ టోర్నీకి ప్రధాన ఆతిథ్యం ఇచ్చే దేశం పాకిస్థాన్ అయినా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. అందుకే భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడనుంది. ఆతిథ్య దేశం పాకిస్థాన్ కావడంతో అన్ని జట్ల జెర్సీలపై ఆసియా కప్ లోగోతోపాటు పాకిస్థాన్ పేరు ఉంటుంది. ఆసియా కప్‌లో భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్ పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరగనుంది.
Also Read: Asian Champions Trophy 2023: పాకిస్థాన్ పై గెలిచి.. సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..
Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి