Asia Cup 2023 Venue: సందిగ్దంలో ఆసియా కప్ నిర్వహణ.. పాక్ నుంచి మారనున్న వేదిక..?
Update on Asia Cup 2023 Venue: ఐపీఎల్ 2023 ముగియడంతో బీసీసీఐ ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌కు ఆతిద్యదేశం ఏదనేది ఇంకా సందిగ్దంలో ఉంది. పాకిస్తాన్ నుంచి వేదిక మారినట్టు స్పష్టమౌతోంది.
Asia Cup 2023 Venue: ఐసీసీ ప్రపంచకప్ తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన టోర్నీ ఆసియా కప్. ఆసియా కప్ 2023 కు పాకిస్తాన్ ఆతిద్యం ఇవ్వాల్సి ఉంది. కానీ సెక్యూరిటీ ఇతర కారణాలతో ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల అభ్యంతరాలతో వేదిక ఎక్కడనేది సందిగ్దంలో పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. అంటే ఐసీసీ ప్రపంచకప్ 2023కు కొద్దిగా ముందు. ఈ టోర్నీలో ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ సహా ఇతర దేశాలు పాల్గొననున్నాయి. పాకిస్తాన్‌లో నిర్వహణపై సెక్యూరిటీ కోణంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా క్రికెట్ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో ఇప్పుడు టోర్నీ ఎక్కడ నిర్వహించేది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ రెండు ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదన ప్రకారం ఆసియా కప్ టోర్నీ నిర్వహణ పాకిస్తాన్‌లో ఉంటుంది. ఇండియా మాత్రం న్యూట్రల్ వేదికలో పాకిస్తాన్‌తో ఆడవచ్చు.
Also Read: WTC Final 2023: ఆస్ట్రేలియా వారిద్దరి గురించే ఆందోళన చెందుతోంది: రికీ పాంటింగ్
ఇక రెండవ ప్రతిపాదన ప్రకారం ఆసియా కప్ టోర్నీ రెండు భాగాలుగా ఉంటుంది. తొలి రెండు మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిద్యం ఇస్తుంది. ఇందులో ఇండియా మ్యాచ్‌లు ఉండవు. ఇక రెండవ రౌండ్‌లో ఇండియా ఆడుతుంది. టోర్నీ ఫైనల్ మాత్రం తటస్థ వేదికపై ఉంటుంది.
అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. అదే సమయంలో ఆసియా కప్ 2023 శ్రీలంకలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఆసియా కప్ నిర్వహణను పాకిస్తాన్ నుంచి లాక్కుని..ఇండియాలో లేదా శ్రీలంకలో జరపవచ్చని సమాచారం.
Also Read: WTC Final 2023 Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి