Mohammed Siraj: గొప్ప మనసు చాటుకున్న మహ్మద్ సిరాజ్.. పైనల్లో వచ్చిన ప్రైజ్ మనీ ఎవరికిచ్చాడంటే?
Mohammed Siraj: హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆసియాకప్ 2023 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా లభించి క్యాష్ ప్రైజ్ ను గ్రౌండ్ సిబ్బందికి ఇచ్చేశాడు. దీంతో సిరాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Asia Cup final 2023: ఆసియా కప్ ఫైనల్ హీరో మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) తన మంచి మనసును చాటుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కింద గెలుచుకున్న 5 వేల అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.4లక్షలు)ను ప్రేమదాస స్టేడియం(Premadasa Stadium) సిబ్బందికి ఇస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.
‘గ్రౌండ్ మెన్ లేకుంటే ఈ టోర్నీ సాధ్యమయ్యేది కాదు. వాళ్ల కష్టానికి గుర్తింపుగా నా ప్రైజ్‌మనీని ఇచ్చేస్తున్నా’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council), శ్రీలంక క్రికెట్(Srilanka Cricket) బోర్డు సైతం కూడా క్యాండీ, కొలంబోలోని గ్రౌండ్ స్టాఫ్‌కు USD 50,000(సుమారు రూ.42లక్షలు) బహుమతిని ప్రకటించాయి.
ఆసియా కప్ తుదిపోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను సిరాజ్ దెబ్బతీశాడు. ఈ హైదరాబాదీ పేసర్ ధాటికి లంకేయులు ఒకర తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. మరోవైపు బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో 50 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టీమిండియా 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. 8వసారి టైటిల్ ను ముద్దాడింది. ఒకే ఓవరల్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక వెన్నువిరిచిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‍లో అత్యంత వేగంగా (16 బంతుల్లో) 5 వికెట్లు తీసిన చమింద వాస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు.
Also Read: Ind vs SL: సిరాజ్ దెబ్బకు శ్రీలంక విలవిల, అరుదైన రికార్డులు సాదించిన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook