IND vs PAK Asia Cup 2023: ఆసియా కప్ 2023కి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉండగా.. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. 2023, 2024 మధ్య జరిగే టోర్నమెంట్ల క్రికెట్ క్యాలెండర్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా గురువారం విడుదల చేశారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అందులో ఇచ్చారు. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుండగా.. సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్థాన్‌కు ఉంది. అయితే ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని జై షా ఇప్పటికే స్పష్టం చేశారు. టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించవచ్చని వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.


ఈ ఏడాది ఆసియా కప్‌లో ఒకే భారత్, పాక్‌తోపాటు క్వాలిఫైయర్ 1 జట్టు ఉంటుంది. మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఉన్నాయి. ఇందులో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఆ తర్వాత పురుషుల అండర్ 19 ఆసియా కప్ కూడా డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.  


2023-2024 మధ్యలో మొత్తం 145 వన్డేలు, టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2023లో 75, 2024లో 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది కాకుండా, ఎమర్జింగ్ (అండర్ -23) ఆసియా కప్ కూడా క్యాలెండర్‌లోకి తిరిగి వచ్చింది. ఈ ఏడాది జూలైలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఉంటుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. 


 



ఈ ఏడాది ఆసియా కప్‌కు అసలు ఆతిథ్యం పాకిస్థాన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అక్కడ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా బీసీసీఐ వైఖరిని వ్యతిరేకించారు. భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తానని కూడా ఆయన బెదిరించారు. అయితే పీసీబీలో అధికార బదలాయింపు తర్వాత రమీజ్ స్థానంలో నజం సేథీ రావడంతో ఇందులో కొంత సానుకూల పరిణామం కనిపించే అవకాశం ఉంది.


Also Read: Fastest Ball By Indian Bowler: టీమిండియా తరుఫున అత్యంత వేగవంతమైన టాప్-5 బౌలర్ల వీళ్లే..   


Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook