India vs Malaysia, Asian Games quarterfinal: ఏషియ‌న్ గేమ్స్ క్రికెట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం మ‌లేషియాతో జ‌రిగిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణం రద్దయింది. దీంతో ర‌న్‌రేట్ ఎక్కువ ఉన్న కారణంగా టీమిండియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో వర్షం కారణంగా టీమిండియా, మలేషియా జట్ల మధ్య మ్యాచ్‌ను 15 ఓవ‌ర్ల‌కు కుదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుదట బ్యాటింగ్ చేసిన టీమిండియా షెఫాలీ వ‌ర్మ ధనాధన్ ఇన్నింగ్స్, రొడ్రిగాస్ మెరుపులతో కేవలం పదిహేను ఓవర్లలోనూ 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వ‌ర్మ కేవ‌లం 39 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 69 పరగులు చేసింది. దీంతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా ప్లేయర్ గా నిలిచింది. మరోవైపు జెమిమా రోడ్రిగ్స్  29 బంతుల్లోనే ఆరు ఫోర్ల‌తో 47 ర‌న్స్ చేసింది. చివరిలో రిచా ఘోష్ మలేషియా బౌలర్లుపై విరుచుకుపడింది. ఏడు బాల్స్‌లోనే ఒక సిక్స‌ర్‌, మూడు ఫోర్స్‌తో 21 ర‌న్స్ రాబట్టింది. కెప్టెన్ స్మృతి మంధాన 16 బంతుల్లో 27 పరుగులు చేసింది.


Also Read: ICC ODI Rankings: ఒక్క మ్యాచ్​తో అగ్రస్థానానికి సిరాజ్.. వరల్డ్ నం.1 బౌలర్‌గా హైదరాబాదీ.


భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేషియా జట్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు.  వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.  ఆ జట్టు కేవలం డెలివరీలు మాత్రమే ఆడింది. మెరుగైనా రన్ రేట్ ఉన్న కారణంగా భారత మహిళల జట్టు సెమీస్‌కి చేరింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు నాలుగో స్థానంలోనూ, మలేషియా టీమ్ 27వ స్థానంలోనూ ఉన్న సంగతి తెలిసిందే. 



Also Read: Team India New Jersey: వన్డే వరల్డ్ కప్.. టీమిండియా కొత్త జెర్సీ విడుదల..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook