AUS Vs ENG: Australia Batter Travis Head Tests Positive For Covid, Out Of 4th Ashes Test : యాషెస్‌ సిరీస్‌లో నాలుగో టెస్ట్‌ ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాకే తగిలింది. ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు ట్రావియస్‌ హెడ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు ట్రావియస్‌ హెడ్‌ దూరమయ్యాడు. తాజాగా ట్రావియస్‌ హెడ్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. అయితే ట్రావియస్‌ హెడ్‌కు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, అయితే అతను భార్య‌తో క‌లిసి మెల్‌బోర్న్‌లో ఐషోలేషన్‌లో ఉంటాడని జట్టు ప్రకటిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక యాషెస్‌ సిరీస్‌ను (Ashes series) ఆస్ట్రేలియా (Australia) కైవసం చేసుకోవడంలో ట్రావియస్‌ హెడ్‌ (Travis Head) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో జో రూట్ తర్వాత ఎక్కువగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ట్రావియస్‌ హెడ్‌ (Head) ఉన్నాడు. యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి జరగనుంది. ఇంగ్లండ్‌, ఆసీస్‌ జట్ల యాషెస్ సిరీస్‌ జరుగుతోంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ (England) టీమ్‌లోని స్టాఫింగ్ స్టాఫ్‌లోని ఏడుగురు స‌భ్యులు కోవిడ్ బారినపడ్డారు.


ఇక హెడ్ స్థానంలో మిచెల్ మార్ష్, నిక్ మాడిన్సన్, జోష్ ఇంగ్లిస్‌లను ఆసీస్‌ జ‌ట్టులోకి చేర్చుకున్నారు. కాగా హోబ‌ర్ట్ వేదికగా జరగబోయే యాషెస్‌ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్‌లో ట్రావియస్‌ హెడ్ అవకాశాలున్నాయి. ఇక కోవిడ్ పాజిటివ్ వ్యక్తి స‌న్నిహితంగా మెలగడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్ సెకెండ్ టెస్ట్‌కు దూర‌మైన విషయం తెలిసిందే.


Also Read : Born on Same Day: ఆ ఊర్లో జనవరి 1వ తేదీన 80 శాతం మంది పుట్టారంట.. అదెక్కడో తెలుసా? 


ఇక ఆస్ట్రేలియా దేశీయ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్‌) (Big Bash League) నిర్వహణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. బిగ్‌బాష్ లీగ్‌లో రెండు ఫ్రాంచైజీలకు చెందిన 11 మంది క్రికెటర్లకు కోవిడ్ సోకింది. ఇక ట్రావియస్‌ హెడ్‌ కూడా ఆ జాబితాలో చేరాడు.


Also Read : Video: గుడ్ల నుంచి కాదు.. నేరుగా పాము కడుపు నుంచే బయటకొచ్చిన పిల్ల పాము..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook