Missing Photo: సోషల్ మీడియాలో ఇప్పుడో ఫోటో వైరల్ అవుతోంది. ఫోటోలో మిస్సైన గ్రేట్ ఆల్‌రౌండర్ ఎవరంటూ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విసిరిన సవాలుకు ఎంతమంది ఎలా స్పందించారో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తరచూ కాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు. ఇప్పుడు మరోసారి ట్రెండీ క్వశ్చన్‌తో హల్‌చల్ చేస్తున్నాడు. అజారుద్దీన్ ఇటీవల షేర్ చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ సందర్భంగా సిడ్నీ హార్బర్ వేదికగా అన్ని క్రికెట్ జట్లతో పాటు కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. అప్పటి ఈ ఫోటోను మొహమ్మద్ అజారుద్దీన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో వింతేముందనుకుంటున్నారా..ఫోటోతో పాటు అజారుద్దీన్ ఓ ప్రశ్న సంధించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచకప్. సిడ్నీ హార్బర్‌లో అన్ని క్రికెట్ జట్లు, కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోలో ఓ అద్భుతమైన ఆల్ రౌండర్ మిస్సయ్యాడు, ఎవరో ఊహించగలరా అంటూ అజారుద్దీన్ ప్రశ్నించాడు.


ఈ ఫోటో బాగా వైరల్ అయింది. నెటిజన్లు భారీగానే స్పందించారు. అంతేకాదు అజారుద్దీన్ ఎవరి గురించి అడిగాడో పసిగట్టేసి..ట్వీట్లు చేశారు. ఇప్పటికే 12 వేల 5 వందలకు పైగా ఈ ఫోటో కాంటెస్ట్ వీక్షించారు. అందరూ సమాధానం చెప్పేశారు. నెటిజన్లు చెప్పింది సరైన సమాధానమేనని అజారుద్దీన్ రిప్లై కూడా ఇచ్చాడు. ఇంతకీ ఆ మిస్సైన గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. అత్యవసర పని ఉండటంతో కపిల్ దేవ్ ఇండియాకు వెళ్లడంతో ఫోటో మిస్సయ్యాడట. అయితే గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌గా కపిల్ దేవ్‌ను అభివర్ణించడంపై పాకిస్తాన్ నెటిజన్లకు అభ్యంతరం వ్యక్తమైంది. గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ ఇమ్రాన్ ఖాన్ అంటూ వాదనకు దిగారు. 1992లో జరిగిన ఈ ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి పాకిస్తాన్ తొలిసారిగా టైటిల్ గెల్చుకుంది. దురదృష్ఠవశాత్తూ టీమ్ ఇండియా ఈ టోర్నీలో తొలిరౌండ్ నుంచే నిష్క్రమించింది. కానీ లీగ్ దశలో పాకిస్తాన్‌పై విజయం సాధించింది.



Also read: IND vs SL T20: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20! లంకపై విజయఢంకా మోగిస్తారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook