BBL 2022: బిగ్‌బాష్ లీగ్‌లో పెను సంచలనం..15 పరుగులకే ఆలౌట్! స్టార్లున్నా కూడా అయిపాయె
Sydney Thunder Bowled Out For 15 Runs vs Adelaide Strikers In BBL 2022. బీబీఎల్ 2022లో పెను సంచలనం నమోదైంది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయింది.
Sydney Thunder folds for 15 runs vs Adelaide Strikers in BBL 2022: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) 2022లో పెను సంచలనం నమోదైంది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయింది. బిగ్ బాష్ లీగ్ సీనియర్ డివిజన్లో ఇంత స్వల్ప స్కోరుకు ఓ జట్టు ఆలౌట్ అవడం ఇదే తొలిసారి. బిగ్‌బాష్ టోర్నీ చరిత్రలోనే సిడ్నీ థండర్స్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రొఫెషనల్ టీ20ల్లో చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ హేల్స్, రిలీ రొసో లాంటి అంతర్జాతీయ స్టార్లున్న సిడ్నీ జట్టు.. 15 పరుగులకే ఆలౌట్ అవడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 రన్స్ చేసింది. క్రిస్ లిన్ (36) టాప్ స్కోరర్. కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 33 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. షార్ట్ (9), వెదర్‌రాల్డ్ (10), థామస్ కెల్లీ (13), రషీద్ ఖాన్ (9) లాంటి స్టార్లు విఫలమయ్యారు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు పడగొట్టగా.. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ కేవలం 5.5 ఓవర్లలో 15 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (0), మాథ్యూ గిల్క్స్ (0) డకౌట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రైలీ రూసో (3) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. జేసన్ సంఘా (0), డేనియల్ సామ్స్ (1), ఆలివర్ డేవిస్ (1) కూడా పరుగులు చేయలేదు. అడిలైడ్ బౌలర్లు హెన్రీ థోర్టన్, వెస్ అగర్‌లు పోటీ పడుతూ వికెట్లు తీయడంతో.. సిడ్నీ బ్యాటర్లు కోలుకోలేకపోయారు. ఐదుగురు డకౌట్ కాగా.. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బ్రెండన్ డాగెట్ (4) టాప్ స్కోరర్. సిడ్నీ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్ ఉండడం విశేషం. కనీసం పవర్ ప్లే కూడా ముగియకముందే (5.5 ఓవర్లు) సిడ్నీ ఆలౌట్ అవడంతో అందరూ షాక్ అవుతున్నారు.
Also Read: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. అశ్విన్, కుంబ్లే రికార్డ్స్ బ్రేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.