IPL 2022: అభిమానులకు గుడ్ న్యూస్.. నేరుగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు! కానీ ఓ కండిషన్!!
25% Crowd Permitted For 1st Phase of IPL 2022. ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి అభిమానులకు ఓ గుడ్ న్యూస్. స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ పేర్కొంది.
BCCI allowed 25 percent Crowd for IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు సంబంధించి అభిమానులకు ఓ గుడ్ న్యూస్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సీజన్లుగా ఖాళీ మైదానాల్లో జరిగిన మెగా లీగ్ ఐపీఎల్.. 15వ సీజన్ మాత్రం ప్రేక్షకుల మధ్యే జరగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నీ నేపథ్యంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది.
రాష్ట్రంలో కరోనా కేసులుభారీ స్థాయిలో తగ్గిన నేపథ్యంలో స్టేడియాల్లో ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ పేర్కొంది. లీగ్ ఆరంభం అయ్యాక (ఏప్రిల్ 15 వరకు జరిగే మొదటి దశకు 25% మంది) కరోనా కేసుల పరిస్థితుల్ని బట్టి సీటింగ్ కెపాసిటీని పెంచుతామని కూడా బోర్డు ప్రకటించింది. బుధవారం బీసీసీఐ, మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధికారుల సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండు డోసుల టీకా తీసుకున్న వారికి మాత్రమే మైదానంలోకి అనుమతి ఉంటుంది.
మరోవైపు 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 8 నుంచి జట్లన్నీ ముంబైకు చేరుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్‌లోనే ఉన్న ప్లేయర్స్ మూడు రోజులు, విదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లు ఐదు రోజుల పాటు ముంబైలో క్వారంటైన్‌లో ఉండాలి. మూడు పరీక్షల్లో (1,2,3/5) నెగటివ్ వచ్చిన వారు క్వారంటైన్ నుంచి బయటకి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును మాత్రమే బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. ప్రాక్టీస్ సెషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ 2022 సీజన్ జరగనుంది. ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్ వివరాలను బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ముంబై, పుణెలోని నాలుగు స్టేడియాల్లోనే జరుగనున్నాయి. ప్లేఆఫ్ మ్యాచులు గుజరాత్ వేదికగా జరగనున్నాయని సమాచారం. ముంబైలోని వాంఖడే మైదానంలో 20 మ్యాచులు, బ్రబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచులు, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచులు జరగనున్నాయి. ఇక పుణెలోని ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియంలో 15 మ్యాచులు జరుగుతాయి.
Also Read: Petrol Price Hike: భారత్‌లో లీటరు పెట్రోలుపై రూ.15 పెంపు.. ఎప్పటినుంచో తెలుసా?!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook