India's Squad For New Zealand Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇండియన్ టీమ్ ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News). స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.  తొలి టెస్టుకు విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉండని నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్ కెప్టెన్ గా ఛతేశ్వర్‌ పుజారా పేరును ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ లకు టెస్టులకు విశ్రాంతినిచ్చింది. కాగా ఈ సిరీస్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్‌తో రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నాడు. 



న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా జట్టు:


అజింక్య రహానె (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. (విరాట్ కోహ్లీ రెండో టెస్టు నుంచి కెప్టెన్ గా అందుబాటులో ఉంటాడు) 


Also Read: Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం 


Also Read: Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook