BCCI announces squads for New Zealand and Bangladesh tours: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. మెగా టోర్నీ అనంతరం భారత్ న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ పర్యటనలకు వెళ్లనుంది. నవంబరు 18 నుంచి కివీస్ టూర్ ఆరంభం అవుతుంది. ఈ టూర్‌లో భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. ఇక డిసెంబరు 4 నుంచి 26 వరకు బంగ్లా పర్యటన సాగుతుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, రెండు టెస్టుల  భారత్ ఆడనుంది. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ టూర్‌లకు సంబంధించి వేర్వేరు జట్లను సోమవారం బీసీసీఐ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్‌ టూర్:
టీ20 జట్టు: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్‌ (వైస్ కెప్టెన్), శుభమాన్ గిల్‌, ఇషాన్ కిషన్‌, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్‌, వాషింగ్టన్ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, మొహ్మద్ సిరాజ్‌, హర్షల్‌ పటేల్, భువనేశ్వర్‌ కుమార్, ఉమ్రాన్‌ మాలిక్. 
వన్డే జట్టు: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), రిషబ్ పంత్‌ (వైస్ కెప్టెన్), శుభమాన్ గిల్‌, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్‌, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్, షాబాజ్‌ అహ్మద్, యుజ్వేంద్ర చహల్‌, కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్‌ చహర్, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.



బంగ్లాదేశ్‌ టూర్:
వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, రజత్‌ పటిదార్, శ్రేయస్‌ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్‌, ఇషాన్‌ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్‌, దీపక్‌ చహర్, యశ్‌ దయాల్‌. 
టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమాన్ గిల్‌, చేటేశ్వర్ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్ పంత్‌, కేఎస్ భరత్‌, ఆర్ అశ్విన్‌, ఆర్ జడేజా, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్‌ ఠాకూర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్. 


Also Read: Mark Adair: ఒకే ఓవర్‌లో 11 బంతులు.. టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డు!


Also Read: Aishwarya Rajesh Pics: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్.. మరింత అందంగా తమిళ బ్యూటీ! పిక్స్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook