BCCI announces Womens T20 Challenge 2022 shcedule and squads: మహిళల టీ20 ఛాలెంజ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ముహూర్తం పెట్టింది. నాలుగో సీజన్ (మహిళల టీ20 ఛాలెంజ్‌ 2022) మే 23న ప్రారంభమవుతుందని బీసీసీఐ తన ఆధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మహిళల ఐపీఎల్ కోసం మూడు జట్లను, షెడ్యూల్‌ను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2020లో చివరిగా జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత సంవత్సరం మహిళల టీ20 టోర్నీ జరగలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల టీ20 ఛాలెంజ్‌ 2022లో మూడు జట్లు ఆడనున్నాయి. ట్రైల్‌బ్లేజర్స్, సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు మహిళల ఐపీఎల్ 2022 ఆడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మరియు దీప్తి శర్మ వరుసగా సూపర్‌ నోవాస్, ట్రైల్‌బ్లేజర్స్, వెలాసిటీకి కెప్టెన్‌లుగా ఎంపికయ్యారు. సీనియర్ ప్లేయర్స్ మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, శిఖా పాండేకి మహిళల టీ20 ఛాలెంజ్‌ 2022 కోసం బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. 


దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయర్స్ మహిళల టీ20 ఛాలెంజ్‌ 2022లో ఆడనున్నారు. మొత్తం పన్నెండు మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఈ టోర్నీలో ఆడతారని సమాచారం. ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ మొత్తం 16 మంది సభ్యులతో కూడిన మూడు జట్లను ఎంపిక చేసింది. ప్రారంభ గేమ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌తో సూపర్‌నోవాస్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.



జట్లు:
సూపర్ నోవాస్: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), తనియా భటియా (వైస్ కెప్టెన్), అలానా కింగ్, ఆయుష్ సోనీ, చందు వీ, దీయాంద్ర దత్తీన్, హర్లీన్ డియోల్, మేఘన సింగ్, మోనికా పటేల్, ముక్సాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రషీ కనోజియా, సోఫీ ఎక్లేస్టోన్, సునే లూజ్, మన్షీ జోషీ.


వెలాసిటీ: దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సఫాలీ వర్మ, అయబంగ కాకా, కేపీ నవీగిరే, కాతిరన్ క్రాస్, కీర్తి జేమ్స్, లౌరా వాల్వర్డ్, మాయా సోనవనే, నత్తకమ్ ఛాంతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదర్, శివాలి షిండే, సిమ్రాన్ బహదూర్, యస్తికా బాటియా. 


ట్రైల్ బ్లేజర్స్: స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్ (వైస్ కెప్టెన్), అరుంధతీ రెడ్డి, హయల్లీ మాథ్యుస్, జెమిమీయా రోడ్రీగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా గోష్, ఎస్.మేఘన, సైకా ఇషాకూ, సల్మా ఖాతూన్, షమీన్ అక్తర్, సుజాత మాలిక్, సోఫీయా బ్రౌన్, ఎస్బీ ప్రభాకర్.


Also Read: 'సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు.. ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్!


Also Read: Lady Finger: మీ డైట్‌లో బెండకాయ చేరిస్తే.. ఆ వ్యాధులకు చెక్... బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.