Ajit Agarkar: బీసీసీఐ కొత్త ఛీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్, జీతం ఎంతంటే
Ajit Agarkar: బీసీసీఐకు కొత్త ఛీఫ్ సెలెక్టర్ వచ్చాడు. టీమ్ ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని బీసీసీఐ ట్వీట్ ద్వారా ప్రకటించింది.
Ajit Agarkar: బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్‌గా చేతన్ శర్మ స్థానంలో ఎవరనేది నిర్ధారణ అయింది. కొత్త చీఫ్ సెలెక్టర్‌గా టీమ్ ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను నియమించింది బీసీసీఐ సెలెక్షన్ ప్యానల్‌లోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ ప్యానెల్. అజిత్ అగార్కర్ నేపధ్యం, క్రికెట్ కెరీర్ ఎలా సాగిందనేది పరిశీలిద్దాం..
టీమ్ ఇండియాలో 1998లో ప్రవేశించిన ముంబై రంజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇతడి పూర్తి పేరు అజిత్ బాల్‌చంద్ర అగార్కర్. వన్డే ఫార్మట్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. విశేషమేమంటే అజిత్ అగార్కర్ పేరుపై ఉన్న రికార్డులు చాలావరకూ ఇప్పటికీ బ్రేక్ కాలేదు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు ఇప్పటికీ అలానే ఉంది. ముంబై రంజీ జట్టులో అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియాలో చోటు సంపాదించిన అజిత్ అగార్కర్ 1998 ఏప్రిల్ 1వ తేదీన తొలి వన్డే ఆస్ట్రేలియాపై ఆడాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడంటారు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పూర్తి చేసిన ఘనత అజిత్ అగార్కర్‌దే.
కేవలం 23 వన్డేల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఇది ప్రపంచ రికార్డు కూడా. అయితే 1998లో అజిత్ అగార్కర్ నెలకొల్పిన ఈ రికార్డును 2009లో శ్రీలంకకు చెందిన అజంతా మెండీస్ బ్రేక్ చేశాడు. 2005-06 నాటికి టీమ్ ఇండియాలో కీలకమైన పేసర్‌గా మారాడు. 9 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రిటైర్మెంట్ తరువాత ముంబై జట్టుకు ప్రధాన సెలెక్టర్‌గా పనిచేశాడు. ఆ తరువాత ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. గతంలో అంటే మొన్నటివరకూ ఛీఫ్ సెలెక్టర్‌కు ఏడాదికి 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకూ పారితోషికం చెల్లించేది బీసీసీఐ. అయితే అజిత్ అగార్కర్‌కు మాత్రం వార్ఖిక వేతనం 3 కోట్ల వరకూ ఇవ్వనున్నారు. ఛీఫ్ సెలెక్టర్‌కు పారితోషికం తక్కువనే కారణంగా చాలామంది ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోలేదు. వీరేంద్ర సెహ్వాగ్ జీతం తక్కువనే కారణంతోనే ఈ పదవిని తిరస్కరించినట్టు సమాచారం.
Also read: ICC World Cup 2023: స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. వరల్డ్ కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook