BCCI approves 10 teams for 2022 IPL | న్యూఢిల్లీ: బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) లో ప‌ది జట్లు ఆడతాయని పేర్కొంది. ఈ ఏడాది కాకుండా 2022లో జరిగే ఐపిఎల్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను ప్రవేశపెట్టేందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా పాలకమండలి ఆమోదించింది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఐపీఎల్‌లో ప్రస్తుతం 8 జట్లు ఉండగా.. వాటి సంఖ్యను 10కి పెంచాలని ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి వ‌చ్చే సీజ‌న్ (2021) నుంచే ఐపీఎల్‌లో ప‌ది జ‌ట్లు ఉంటాయ‌ని భావించినా.. దానికి త‌గినంత స‌మ‌యం లేదని బోర్డు స‌భ్యులు పేర్కొన్నారు. కావున 2022లో జట్ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు. అయితే 2022లో ఐపీఎల్‌ (IPL) లో భాగస్వామ్యం అయ్యే జట్ల గురించి ఇంకా వెల్లడించలేదు. ఈ జట్లను కొనుగోలు చేయ‌డానికి దిగ్గ‌జ వ్యాపార‌స్తులు ఆస‌క్తి చూపుతున్నట్లు సమచారం. Also Read : India Vs Australia ODI Series: క్రికెట్‌లో ఆ షాట్‌ను నిషేధించాలి.. తెరపైకి కొత్త వాదన


దీంతోపాటు ఈ సర్వసభ్య సమావేశంలో బోర్డు సభ్యులు (BCCI) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2028 ఒలింపిక్స్‌ (Olympics)లో క్రికెట్‌ను చేర్చాల‌న్న ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణ‌యానికి బీసీసీఐ మ‌ద్ద‌తు ప్రకటించింది. దీంతోపాటు కోవిడ్ వల్ల క్రీడాకారులకు తగ్గిన పారితోషకాన్ని యథావిధిగా అందించాలని, టోర్నీల నిర్వహణ తదితర అంశాలపై బీసీసీఐ నిర్ణయాలను తీసుకుంది.


Also read: Parthiv Patel Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పార్థివ్ ప‌టేల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook