Ranji Trophy 2020-21: కరోనా వైరస్ కారణంగా తొలిసారి దేశవాళీ క్రికెట్ టోర్నీ నిలిచిపోయింది. 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని రద్దు చేసింది బీసీసీఐ. ప్రత్యామ్నాయంగా విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవాళీ క్రికెట్ టోర్నీగా ప్రాముఖ్యత పొందిన రంజీ క్రికెట్ టోర్నీ ( Ranji trophy ) 87 ఏళ్ల అనంతరం తొలిసారి ఆగిపోయింది. కరోనా వైరస్ కారణంగా ఈ సీజన్ అంటే 2020-21 రంజీ టోర్నీ నిర్వహించడం లేదని బీసీసీఐ ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్ కు ఆస్కారం లేదని..బీసీసీఐ తెలిపింది. రంజీకు బదులు 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ ( Vijay Hazare Trophy ) నిర్వహించాలని బీసీసీఐ ( BCCI ) నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ లేఖ రాశారు. రంజీ నిర్వహించకపోవడమనేది 87 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. 


కరోనా మహమ్మారి కారణంగా 2020-21లో విలువైన సమయాన్ని కోల్పోయామని బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్ 2021  ( Ipl 2021 Auction ) సీజన్ ఆటగాళ్ల వేలానికి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ( Syed Mustaq ali t20 tourney ) ను నిర్వహించనుంది బీసీసీఐ. మరోవైపు సీనియర్ మహిళల వన్డే క్రికెట్ తో పాటు విజయ్ హజారే, అండర్ 19 క్రికెటర్ల కోసం వినో మన్కడ్ ట్రోఫీలు నిర్వహించాలనుకుంటున్నట్టు బీసీసీఐ తెలిపింది. మార్చ్ నెలాఖరులో ఐపీఎల్ 14వ సీజన్ ( Ipl Season 14 ) ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సయ్యద్ ముస్తాక్ టీ20 , ఐపీఎల్ సీజన్ 14 రెండు ట్రోఫీల్ని బయో బబుల్ ( Bio Bubble )లో నిర్వహించనుంది బీసీసీఐ. సయ్యద్ ముస్తాక్ టీ20 వేదికల్ని త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.


Also read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం తేదీ, వేదిక ఖరారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook