BCCI: వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం తరువాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను తొలగించి ఆ స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కొనసాగిస్తారనే వార్తలు విన్పించాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్ పర్యటనకు సైతం వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయంతో టీమ్ ఇండియా కూర్పు విషయంలో చాలా సందేహాలు మొదలయ్యాయి. కెప్టెన్, హెడ్ కోచ్ ఇద్దర్నీ మార్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విషయంలో మరింత ఎక్కువగా పుకార్లు వ్యాపించాయి. ఈ వార్తలన్నింటిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను కొనసాగిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. దాంతో ఆస్ట్రేలియా సిరీస్ తరువాత టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు. తనపై నమ్మకం ఉంచి మరోసారి ప్రధాన కోచ్‌గా కొనసాగించినందుకు రాహుల్ ద్రావిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజన్ బిన్నీ, సెక్రటరీ జైషాకు రాహుల్ ద్రావిడ్ కృతజ్ఞతలు తెలిపాడు. 


రాహుల్ ద్రావిడ్‌తో పాటు ఇతర కోచ్‌ల పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌లు మరి కొంతకాలం తమ తమ పదవుల్లో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు వరకూ రాహుల్ ద్రావిడ్ సహా ఇతర కోచ్‌లు తమ తమ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా జైత్రయాత్రలో ద్రావిడ్ స్థానం అద్భుతమని, అందుకే మరోసారి ప్రధాన కోచ్ అయ్యే అర్హత సాధించినట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. 


2021లో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం వన్డే ప్రపంచకప్ 2023తో ముగిసింది. రెండేళ్లపాటు పదవిలో కొనసాగిన ద్రావిడ్ కు బీసీసీఐ మరోసారి అవకాశమిచ్చింది. అయితే ఈసారి ఎంతకాలం పదవీకాలం పొడిగించారనేది ఇంకా తెలియలేదు. వాస్తవానికి పదవీకాలం పొడిగింపుపై ద్రావిడ్ అంగీకరించలేదు. కానీ బీసీసీఐ ద్రావిడ్‌తో మాట్లాడి ఒప్పించింది. 


Also read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో ఇండియాకు సారధ్యం వహించేది అతడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook