Jasprit Bumrah Medical Update: బుమ్రా, శ్రేయాస్ మెడికల్ అప్డేట్ విడుదల.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?
BCCI confirms Jasprit Bumrah, Shreyas Iyer not play in WTC Final 2023. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించిన మెడికల్ అప్‌డేట్‌లను బీసీసీఐ విడుదల చేసింది.
BCCI issues Jasprit Bumrah and Shreyas Iyer Medical Update: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించిన మెడికల్ అప్‌డేట్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసింది. బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఈ స్పీడ్‌స్టర్ వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. మరోవైపు శ్రేయస్‌కు వచ్చే వారం సర్జరీ జరుగనుందని, ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. ఈ ఇద్దరు గాయాల కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
'జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్‌లో వెన్నుముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అది విజయవంతమైంది. ప్రస్తుతం బుమ్రాకు ఎలాంటి నొప్పి లేదు. సర్జరీ అయిన ఆరు వారాల తర్వాత పునరావాసం ప్రారంభించాలని భారత ఫాస్ట్ బౌలర్‌కు స్పెషలిస్ట్ సలహా ఇచ్చాడు. బుమ్రా శుక్రవారం నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం ప్రారంభించాడు' అని బీసీసీఐ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి బుమ్రా ఎలాంటి క్రికెట్ ఆడలేదు. జూలైలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడే అవకాశం లేదు.
'శ్రేయస్ అయ్యర్‌కు వచ్చే వారం సర్జరీ (లోయర్ బ్యాక్ సమస్య) జరుగనుంది. సర్జరీ పూర్తైన తర్వాత రెండు వారాల పాటు సర్జన్ సంరక్షణలో ఉంటాడు. ఆపై బెంగళూరులోని ఎన్‌సీఏకు చేరుకుంటాడు' అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం తీవ్రమైంది. దాంతో ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా మాదిరే అయ్యర్ కూడా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడే అవకాశం లేదు. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఈ ఇద్దరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
వెన్నునొప్పి కారణంగా గతేడాది ఆసియా కప్, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీకి జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు సర్జరీ పూర్తైన్పటికీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అందుబాటులో ఉండడు. అయితే వన్డే వరల్డ్‌కప్ వరకు బుమ్రా జట్టుతో చేరనున్నాడని సమాచారం. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైనప్పటికీ ప్రపంచకప్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.