Kedar Jadhav says MS Dhoni will retire from professional cricket after IPL 2023: 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాత్రమే ఆడుతున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తన వంతు పరుగులు చేస్తున్నాడు. అంతేకాదు అద్భుతమైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అయితే 16వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. తాజాగా సీఎస్‌కే మాజీ ఆటగాడు కేదార్ జాదవ్ స్పందించాడు.
ఐపీఎల్ 2023 అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెపుతాడని భారత మాజీ బ్యాటర్ కేదార్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ నెక్స్ట్‌తో ప్రత్యేక చాట్‌లో కేదార్ జాదవ్ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో ఆటగాడిగా ఎంఎస్ ధోనీకి ఇది చివరి సీజన్ అని నేను 2000 శాతం ఖచ్చితంగా చెబుతున్నా. ఈ జూలైలో ధోనీకి 42 ఏళ్లు వస్తాయి. ఇంకా ఫిట్‌గా ఉన్నప్పటికీ ధోనీ కూడా మనిషే. కాబట్టి రిటైర్మెంట్ ఇస్తాడు' అని అన్నాడు.
'ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కానీ.. అటు ఫాన్స్ కానీ సిద్ధంగా లేరు. అయితే ప్రస్తుత పరిస్థితుల రీత్యా చెన్నై కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందని నేను అనుకుంటున్నా. అభిమానులు ధోనీ మ్యాచ్‌లను అస్సలు మిస్ అవ్వొద్దు. ఫీల్డ్‌లో ఉన్న ప్రతి బంతిని చూసి ఎంజాయ్ చేయండి' అని కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ధోనీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ఉన్నా.. చెన్నైలోని క్రికెట్ అభిమానులలో అతని క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. చెపాక్‌లో చెన్నై హోమ్ గేమ్‌లను ఆడుతున్నప్పుడు కెప్టెన్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు.
బుధవారం (ఏప్రిల్ 12) ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 2.2 కోట్ల మంది వీక్షకులు గేమ్‌ను వీక్షించారు. ప్రస్తుతం మహీ పూర్తిగా ఫిట్‌గా లేడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ధోనీకి గాయం అయింది. ఇక చెన్నైకి ఇప్పటికే 4 టైటిళ్లు అందించిన ధోనీ గొప్ప సారథిగా కొనసాగుతున్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మంచి ఫినిషర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు.
Also Read: Ananya Panday Hot Pics: అనన్య పాండే హాట్ ఫోటోషూట్.. బ్యాక్ అందాలతో హీట్ పుట్టిస్తోన్న లైగర్ పోరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.