Sourav Ganguly Health Condition: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై అప్‌డేట్ వచ్చింది. గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయనకు వైద్య పరీక్షలు చేసిన కోల్‌కతా అపోలో వైద్యులు తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియా ఏఎన్‌ఐతో మాట్లాడారు. గంగూలీ ఆరోగ్యంపై ఏ ఆందోళన అక్కర్లేదని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


గత కొన్ని రోజుల కిందట గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారని తెలిసిందే. చికిత్స అనంతరం గంగూలీ ఆరోగ్యం ఎలా ఉందో, ప్రస్తుతం సైతం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Sourav Ganguly Health Update) ఆరోగ్యం అదే తీరుగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఛాతీలో నొప్పి రావడంతో నేటి మధ్యాహ్నం కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరాడు గంగూలీ.


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం తేదీ, వేదిక ఖరారు


 


నెల రోజుల వ్యవధిలోనే రెండో పర్యాయం గంగూలీకి గుండెపోటు వచ్చిందేమోనని దాదా అభిమానులు ఆందోళన చెందారు. అపోలో వైద్యుల(Apollo Hospital) ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం మెడికల్ టెస్టుల కోసమే గంగూలీ ఆసుపత్రికి వచ్చారని, అంతకు మించి మరే కారణం లేదని వైద్యులు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.


Also Read: Ravichandran Ashwin: చటేశ్వర్ పుజారా అలా చేస్తే సగం మీసం తీసేసి మ్యాచ్ ఆడతానంటూ అశ్విన్ ఛాలెంజ్


 



 


కాగా, నూతన సంవత్సరం సమయంలో గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో సౌరవ్ గంగూలీ చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తంగా 2 స్టెంట్లు వేసి యాంజియోప్లాస్టీ చికిత్స అందించారు. వారం రోజులపాటు అక్కడే చికిత్స తీసుకున్న గంగూలీ(Sourav Ganguly Health Condition) జనవరి 7న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ కావడం తెలిసిందే.


Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook