న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), కార్యదర్శి జై షాల భవిష్యత్ ఏంటనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. వీరిద్దరి పదవీకాలం పొడిగింపు అంశంపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం విచారణ చేపట్టింది. అయితే వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఏస్ఏ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య బెంచ్ విచారణను 2 వారాలపాటు వాయివేసింది.  Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు సమస్య ఏంటి..
బీసీసీఐ (BCCI)లోగానీ, రాష్ట్రాల అధికారిక క్రికెట్ బోర్డులలో గానీ వరుసగా ఆరేళ్లపాటు సేవలు అందించే వ్యక్తి ఆ తర్వాత కనీసం 3ఏళ్ల పాటు పదవులకు దూరంగా ఉండాలి. గతంలో జస్టిస్ లోధా కమిటీ ఈ సిఫారసులు చేయగా 2018 ఆగస్టులో సుప్రీంకోర్టు దీనికి ఆమోద ముద్ర వేసింది. బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల క్రికెట్ సంఘాలలో పదవులు నిర్వహించారు. IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు


గత నెలలో జై షా ఆరేళ్ల పదవీకాలం (ఓవరాల్‌గా) పూర్తయింది. గంగూలీ ఆరేళ్ల పదవీకాలం సైతం ఈ జులై 27న పూర్తి కానుంది. దీంతో నిబంధనల ప్రకారం వీరిద్దరూ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు రెండో వారంలో గంగూలీ, జై షా పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు  
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్