Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
Virat kohli club: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ లను ఓపెన్ చేసే ఉంచుతున్నట్లు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
Bengaluru police filed fir against cricketer virat kohli's one8 commune pub: భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరులోని కస్తూర్ బా రోడ్డులో కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ ఉంది. ఈ పబ్ తరచుగా నిర్ణీత గడువుకన్నా.. అర్దరాత్రి వరకూ ఉంటుందని స్థానికులు పలు పర్యాయాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే.. పోలీసులు.. జూన్ 6వ తేదీన రాత్రి, కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్‌లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
ప్రభుత్వం విధించిన నిబంధనలను కొన్ని క్లబ్ లు, బార్ లు తుంగలో తొక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో.. కస్తూరాబా రోడ్డులోని వన్8 కమ్యూన్, చర్చి స్ట్రీట్‌లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్డులోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై తెల్లవారుజామున 1.20 గంటల వరకు పబ్ తెరిచి ఉంచారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
రాత్రి పూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు పబ్ తెరిచి ఉన్నట్టు సమాచారం అందింది. ఈ క్రమంలో.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. పబ్‌లో కస్టమర్లు ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయానికి మించి పబ్ తెరిచారంటూ పోలీసులు నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయమై బెంగళూరు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ధేశించిన వ్యవధిని ఉల్లంఘించి కస్టమర్లకు అనుమతించిన పబులు, రెస్టారెంట్లపై కేసు నమోదు చేశామన్నారు.
వన్ 8 కమ్యూన్ మాత్రమే కాకుండా సెంట్రల్ డివిజన్ పరిధిలో కాలపరిమితి దాటి వ్యాపారం చేస్తున్న మరికొన్ని రెస్టారెంట్లు, పబ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. టీ20 ముగియగానే..అనుష్క శర్మ, వామికా, అకాయ్ లండన్ లోనే ఉండటంతో, విరాట్ కోహ్లీకూడా అక్కడికి వెళ్లిపోయారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు చెందిన పబ్ పై కేసు నమోదు కావడం మాత్రం హట్ టాపిక్ గామారింది. వన్ 8 కమ్యూన్ మెనెజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more: Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
మెట్రో నగరాలైన, ఢిల్లీ, ముంబాయి, పుణె, కోల్ కతా లలో కూడ వన్8 కమ్యూన్ బ్రాంచ్ లు ఉన్నాయి. బెంగళూరు పబ్ ను గతేడాది డిసెంబర్ లో ప్రారంభిచినట్లు తెలుస్తోంది. కస్తూర్బా రోడ్డులో ఉన్న ఈ పబ్ నుంచి.. కబ్బన్ పార్క్, చిన్న స్వామి స్టేడీయంలను చూడోచ్చని చెప్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి