Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral video: యువతి నేలపైన పడుకుని ఉంది. ఇంతలో పదడుగుల పాము ఆమెవైపుకు వేగంగా వచ్చింది. కానీ ఆమె ఏదో అలజడి కావడంతో ఒక్కసారిగా నిద్ర నుంచి మెల్కొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 8, 2024, 09:34 PM IST
  • యువతికి ఊహించని ఘటన..
  • ఇంట్లోకి దూరిన పాము..
Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

snake crawling on sleeping young girl video goes on social media: సాధారణంగా వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. చెట్లు, అడవులు, కొండలకు దగ్గరగా ఉన్న వాళ్ల ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పొలాలు, బియ్యం బస్తాలు, వడ్లు ఉన్న చోట ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎలుకల వేటలో పాములు మన ఇళ్లలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు పాములు మనుషుల అలజడి విన్పించగానే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. చాలా అరుదుగా మాత్రమే అవి మనుషులను కాటు వేస్తాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by हिंदू धर्म (@hindu_dharma_5)

పాములు కాటేయడానికి ముందు పలు మార్లు హెచ్చరిస్తాయి. చివరి అస్త్రంగా మాత్రమే అవి మనిషిని కాటేస్తాయంట. పాములను హని తలపెట్టొద్దని చాలా మంది చెప్తుంటారు. పాములకు కీడు తలపెడితే, సర్పదోషం ఏర్పడుతుంది. దీని వల్ల పెళ్లికాదు, ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. జీవితంలో గ్రోత్ ఉండదు. అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలో.. పాములు కన్పిస్తే కొందరు స్నేక్ సొసైటీల వారికి సమాచారం ఇస్తారు. పాములకు సంబంధించిన వెరైటీ వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి.

కొన్ని ఫన్నీగాను , మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిగాను ఉంటాయి. పాముల కంటెంట్ ఉన్న వీడియోలను చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.  ఇటీవల పాములు వాహనాలు, హెల్మెట్ లు, షూస్ లు, డిక్కీలో  దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు అవి మన మంచాల మీదకు, బట్టలలో కూడా వచ్చిన సంఘటనలు కొకొల్లలు. అచ్చం ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక యువతి నెల మీద చాప వేసుకుని గాఢ నిద్రలో ఉంది. మరీ యువతి.. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పడుకుందో.. ఏంటో కానీ ఒక్కసారిగా అక్కడకు పదడుగుల పాము వచ్చింది. అది ఒకవైపు నుంచి మరోక వైపుకు వెళ్తుంది. యువతి వైపుకు దూసుకెళ్లి, ఆమె ఒంటి మీద నుంచి మరోక వైపుకు వెళ్లింది. యువతికి అకస్మాత్తుగా మెళకువరావడంతో లేచింది. పాములు చూసి గాఢనిద్రలో ఉన్న యువతి షాక్ కు గురైంది. 

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

వెంటనే అక్కడి నుంచి పక్కకు పారిపోయింది. పాము యువతి మెడపై నుంచి పక్కకు వెళ్లిపోవడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి ఎంత లక్కీనో.. అంటూ కొందరు... అసలు నేలపైన వర్షాకాలంలో పడుకోవడం అవసరమా.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. మరికొందరు మాత్రం..‘‘వ్యూస్ కోసం ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Trending News