IPL New Franchise Auction: ఐపీఎల్ 2022 (IPL 2022 News) సీజన్​ క్రికెట్​ అభిమానులను మరింత అలరించనుందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఎందుకంటే లీగ్​లో ప్రస్తుతం ఉన్న 8 టీమ్స్​తో పాటు ఇప్పుడు మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరనున్నాయి. దీనికి సంబంధించిన బిడ్డింగ్​​ (IPL New Franchise Auction) మరికొద్ది సేపట్లో దుబాయ్​ వేదికగా జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్​ సీజన్​లో కొత్త ఫ్రాంచైజీలను అహ్మదాబాద్​, లక్నో (IPL New Franchise Name) నగరాల నుంచి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ టీమ్స్​ను సొంతం చేసుకునేందుకు పెద్ద సంస్థలు పోటీపడనున్నాయి. మరి ఈ ఫ్రాంఛైజీలను ఏఏ కంపెనీలు సొంతం చేసుకుంటాయో మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో వేలంలో ఏఏ కంపెనీలు పోటీపడనున్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్​లో (IPL Broadcast Value) రెండు కొత్త టీమ్స్​ను (New IPL Teams) సొంతం చేసుకునేందుకు అనేక కార్పొరేట్​ కంపెనీలు వేలంలో పోటీ పడనున్నాయి. అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీని చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా బీసీసీఐ అధికార వర్గాలు (BCCI News) చెబుతున్నాయి. మరోవైపు అమెరికాకు చెందిన మాంచెస్టర్​ యునైటెడ్​ యజమాని అయిన గ్లేజర్​ ఫ్యామిలీ కూడా ఈ వేలంలో ప్రధానంగా పోటీపడనుంది. 
ఇంగ్లీష్​ ప్రీమియర్​ లీగ్​లో ఓ టీమ్​ను కొనుగోలు చేసిన రెడ్​ బర్డ్​ క్యాపిటల్స్​ అనే అమెరికా ఆధారిత సంస్థ కూడా బరిలో నిలవనుందని సమాచారం. రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో ప్రస్తుతం ఈ సంస్థకు 15 శాతం వాటా ఉంది. దీంతో పాటు టీమ్ఇండియాకు చెందిన ఓ సీనియర్​ క్రికెటర్​, అదానీ గ్రూప్​, కొటాక్​, అరబిందో ఫార్మా, టొరెంట్​ గ్రూప్​, ఆర్పీ సంజీవ్​ గొయంకా గ్రూప్​ కూడా ఐపీఎల్​లో కొత్త టీమ్స్​ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.    


బీసీసీఐకి భారీ ఆదాయం


ఈ రెండు టీమ్స్​ కోసం జరగనున్న బిడ్డింగ్ ద్వారా రూ.7000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల ఆదాయం బీసీసీఐకి (BCCI Income From IPL 2022) సమకూరుతుందని సమాచారం. కనీసం 3000 వేల కోట్ల వార్షిక ఆదాయం ఉన్న కంపెనీలకే ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండగా.. బిడ్డింగ్ కోసమే కనీసం రూ.2 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ కోసం అవసరమయ్యే 'ఇన్విటెషన్ టు టెండర్' పేరిట లభించే డాక్యుమెంట్‌ని కొనుగోలు చేయడానికే రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.


Also Read: IPL Broadcasting Rights Price: రూ.37 వేల కోట్లకు ఐపీఎల్​ బ్రాడ్​కాస్టింగ్​ రైట్స్​! 


Also Read: T20 World Cup 2021: తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తోంది: గ్రేమ్‌ స్వాన్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook