Wanindu Hasaranga Ruled Out: మన తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ రెండింటిలో గెలిచి నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మన టీమ్ తన తర్వాత మ్యాచ్ ను రేపు అంటే ఏప్రిల్ 09న మహారాజా యద్వీంద్ర సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్ తో మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ఆ జట్టు ఆల్ రౌండర్, శ్రీలంక ప్లేయర్ వనిందు హసరంగా దూరమయ్యాడు. అతడు ఒక మ్యాచ్ కూడా ఆడకుండానే సీజన్ నుంటి నిష్క్రమించాడు. ఇక నుంచి నెక్ట్స్ మ్యాచ్ లో అతడు కనిపించడు. ఈ ఐపీఎల్ వేలంలో హసరంగాను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. ఇప్పుడు అతడు దూరమవ్వడంతో ఎస్ఆర్ హెచ్ టీమ్ మరో విదేశీ ఫ్లేయర్ తీసుకునే అవకాశం ఉంది. 


హసరంగా గతంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో అతడిని 10.75 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఆ సీజన్ లో అతడు మంచి ప్రదర్శన చేశాడు. .54 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. గత ఐపీఎల్ సీజన్ లో 8.9 ఎకానమీతో తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. అతడు శ్రీలంక టీమ్ లో కీలక ప్లేయర్. ఈ ఏడాది జూన్ లో కరేబియన్, యూఎస్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ సమయానికి అతడు కోలుకుంటాడో లేదో వేచి చూడాలి. 


Also read: Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై జట్టు.. టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు..


Also Read: MI vs DC IPL 2024 Highlights: జస్ప్రీత్ బుమ్రా మైండ్ బ్లోయింగ్ యార్కర్.. పృథ్వీ షా దిమ్మతిరిగింది.. క్లీన్‌బౌల్డ్ వీడియో చూశారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook