కరడుకట్టిన హిందుత్వ వాది, గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చారు.  పాకిస్తాన్ కోడలుగా ఉన్న సానియాకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగే అర్హత లేదన్న ఎమ్మెల్యే రాజాసింగ్...  ఆమెను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కశ్మీర్ లో భారత సైనికులపై దాడి అంశాన్ని ప్రస్తావించిన రాజాసింగ్ ..సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించి తమ జోలికి వస్తే పాక్ తో ఎలాంటి సంబంధాలు ఉండబోవని హెచ్చరిక ఇచ్చినట్లువుతుందని రాజాసింగ్ తన వాదనను సమర్ధించుకున్నారు. 


సైనికుల దాడికి నిరసిస్తూ తన పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ సీఎం రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన రాజాసింగ్ ..సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూనే సానియా మీర్జా అంశాన్ని ఇలా తెరపైకి తెచ్చారు


సానియా స్థానంలో ...


పాక్ కోడలైన సానియా మీర్జా స్థానంలో  దేశ కీర్తిని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పిన తెలంగాణ ముద్దుబిడ్డలు లక్ష్మణ్, పీపీ సింధు, సైనా నెహ్వాల్ లలో ఎవరో ఒకరిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఈ సందర్భంగా రాజాసింగ్ డిమాండ్ చేశారు


రాజాసింగ్ డిమాండ్ సరైందేనా ?


టెన్నిస్ దిగ్గజం, హైదరాబాదీని సానియా మీర్జా..పాక్ క్రికెటర్ సోహెబ్ మాలిన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వరుస విజయాలతో టెన్నిస్ రంగంలో  భారత్ సత్తా ఏపాటిదో ప్రపంచానికి తెలియజేసిన సానియాను తెలంగాణ ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి గౌరవించింది. అయితే ఆమె నియమాకాన్ని తప్పుబడుతూ రాజాసింగ్ చేసిన డిమాండ్ ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.