Twitter Blue Tick: ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయిన ధోనీ, కోహ్లీ, రోహిత్.. అసలు కారణం ఇదే!
Indian Cricketers MS Dhoni, Virat Kohli and Rohit Sharmas Blue Tick removed from Twitter. టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయారు.
Indian Cricketers Sachin Tendulkar, MS Dhoni, Virat Kohli and Rohit Sharma Lost BlueTick in Twitter: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'ను ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో మార్పులు చేసిన ఎలన్ మస్క్.. తాజాగా అధికారిక ఖాతాలకు (వెరిఫికేషన్ మార్క్) ఇచ్చే ‘బ్లూ టిక్’కు ఛార్జీలు తీసుకొచ్చారు. డబ్బులు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్‌ను తొలగిస్తామని చెప్పిన మస్క్.. పలుమార్లు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. చివరకు డబులు చెల్లించని వారి ఖాతాలకు గురువారం (ఏప్రిల్ 20) నుంచి వెరిఫికేషన్ మార్క్‌ను తొలగించారు.
డబ్బులు చెల్లించని సెలబ్రిటీలు కూడా తమ ఖాతాలకు బ్లూ టిక్ (BlueTick Twitter) కోల్పోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఖాతాలకు ట్విటర్ వెరిఫికేషన్ మార్క్‌లను తొలగించింది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, సహా పరువురి అకౌంట్ నుంచి బ్లూ టిక్ మాయమైపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ జాబితాలో ఉన్నాడు.
భారత దేశంలోని సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, చిరంజీవి, దీపికా పదుకొణె, ఆలియా భట్ కూడా బ్లూ టిక్‌ను కోల్పోయారు. మరోవైపు ఏపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, యూపీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యోగి ఆదిత్యనాథ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు రాజకీయ నాయకుల ఖాతాలకు బ్లూ టిక్ (Twitter Blue Tick ) లేదు.
గురువారం ఎలన్ మస్క్ కొత్త విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల మంది బ్లూ టిక్ కోల్పోయినట్లు సమాచారం. ట్విట్టర్ బ్లూటిక్ సేవలను పొందాలంటే వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెలించాల్సి ఉంటుంది. ఇక ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి తక్కువ ప్రకటనలు చూసే వెసులుబాటు, నిడివి ఎక్కువ ఉండే వీడియోలను పోస్ట్ చేసుకోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. సెలబ్రిటీ అధికారిక ఖాతాను సూచించేందుకు బ్లూ టిక్ ప్రామాణికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
Also Read: Samyuktha Menon Pics: దేవకన్యలా సంయుక్త మీనన్.. సార్ బ్యూటీ అందాలకు కుర్రకారు ఢమాల్!
Also Read: Sheetal Dabholkar Hot Pics: శీతల్ దభోల్కర్ హాట్ ట్రీట్.. జిప్ విప్పేసి మరీ అందాల ఆరబోత! వైరల్ పిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.