ఇండియాలో జరిగే ఐపీఎల్ తరహాలోనే బంగ్లాదేశ్‌లో బీపీఎల్ టోర్నమెంట్ జరుగుతుంటుంది. బీపీఎల్ లైవ్ మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని సిగ్గుపడేట్టు చేసింది. అది కూడా టీమ్ హెడ్ కోచ్ చేసిన తప్పిదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ అంటే బీపీఎల్ టోర్నీలో మ్యాచ్ జరుగుతుండగా, లైవ్ నడుస్తుండగా టీమ్ హెడ్ కోచ్ చేసిన చేష్ట మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ టీమ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఖాలిద్ మహ్మూద్ మ్యాచ్ జరుగుతుండగా..డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగుతూ లైవ్‌లో దొరికిపోయారు. ఈ మ్యాచ్ ఖుల్నా టైగర్స్ వర్సెస్ ఫార్చ్యూన్ బారిషల్ మధ్యన జరుగుతోంది. కోచ్ ఖాలిద్ మహ్మూద్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఉన్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. హాయిగా, ప్రశాంతంగా, ఏమాత్రం భయం లేకుండా తాగడం ప్రారంభించాడు. ఇదంతా లైవ్ కెమేరాలో రికార్డయింది. 


సిగరెట్ తాగుతున్న కోచ్ ఖాలిద్ మహ్మూద్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగానే..అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ ప్రారంభించారు. దాంతోపాటు అతడిపై చర్యలు తీసుకోవల్సిందిగా నెటిజన్లు కామెంట్లు అందుకున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిగరెట్ తాగడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. మరి ఆతనిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.


ఇంతకుముందు కూడా మ్యాచ్ జరుగుతుండగా ఇలాంటి చేష్టలు కన్పించాయి. గత ఏడాది జరిగిన బీపీఎల్‌లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ షెహజాద్ గ్రౌండ్‌లోనే సిగరెట్ కాలుస్తూ కన్పించాడు. మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావల్సి ఉంది. దాంతో షెహజాద్ గ్రౌండ్‌లో సిగరెట్ కాల్చుతూ కన్పించాడు. అతడిపై అప్పట్లో జరిమానా కూడా విధించారు.


Also read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ మరో ఘనత...'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌' అవార్డుకు ఎంపిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook