Virat Kohli: `కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం మంచి పరిణామమే.. ఇకపై చెలరేగుతాడు`
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం ఒక విధంగా మంచిదే అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. విరాట్ బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందని అంచనా వేశాడు.
Brad Hogg feels Virat Kohli's removal as Team India ODI captain blessing in disguise for him: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ( Virat Kohli) వన్డే కెప్టెన్సీ (ODI captaincy) కోల్పోవడం ఒక విధంగా మంచిదే అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ (Brad Hogg) పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. విరాట్ బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందని అంచనా వేశాడు. గతంలో కంటే బ్యాటర్‌గా మరింత చెలరేగుతాడని, పరుగుల వరద పారిస్తాడని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు, పరిమిత ఓవర్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల సారథులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లాంటి జట్లకు టెస్టులకు, పరిమిత ఓవర్లకు వేర్వేరు సారథులు ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ ( Virat Kohli).. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో మాత్రం భారత జట్టుకు సారథిగా కొనసాగాలని అనుకున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మాజీలు తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ (Brad Hogg) తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించాడు.
Also Read: Samantha on Divorce Issue: మళ్లీ మళ్లీ అదే అంశమా...నాకిష్టం లేదు
బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్‌గా తొలగించడం మంచి పరిణామమే అని నేను భావిస్తున్నా. కోహ్లీ బీసీసీఐ నిర్ణయాన్ని స్వీకరించి.. ప్రశాంతంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని టెస్టు కెప్టెన్సీపై అతడు దృష్టి సారించాలి. ఇకపై భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతల్ని రోహిత్ శర్మ చూసుకుంటాడు. అతడు కోరుకున్నట్లు జట్టును ముందుకు తీసుకెళ్తాడు. కోహ్లీ మాత్రం టెస్టులను చూసుకుంటే సరిపోతుంది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ లేకపోవడంతో కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి ఉండదు' అని అన్నాడు.
'ఇప్పుడు విరాట్ కోహ్లీపై ఉన్న ఒత్తిడి చాలా వరకు తొలగిపోతుందని నేను అనుకుంటున్నా. ఒక విధంగా ఇది కోహ్లీకే మంచిదని నా అభిప్రాయం. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం వల్ల పెరిగే ఒత్తిడి కారణంగా కోహ్లీ గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోతున్నాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కచ్చితంగా అతడి ప్రదర్శన మెరుగవుతుంది. ఇకపై కోహ్లీ బ్యాటర్‌గా చెలరేగుతాడు' అని బ్రాడ్ హాగ్ (Brad Hogg) పేర్కొన్నాడు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదని హాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ మధ్య ఎలాంటి విద్వేషాలు తలెత్తకూడదన్నాడు.
Also Read: Rahul Gandhi: హిందుత్వకు,హిందూయిజంకు తేడా అదే-బీజేపీపై రాహుల్ ఎటాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి