ప్రభుత్వ రంగ సంస్థగా బీసీసీఐ ; లా కమిషన్ సంచనల సిఫార్సు
బ్యేకింగ్ న్యూస్..బీసీపీఐ ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలని లా కమిషన్ సంచనల సిఫార్సు చేసింది. రాజ్యాంగంలోని 12వ అధికరణ ప్రకారం బీసీసీఐని ప్రభుత్వ రంగ సంస్థగా ప్రకటించే అన్ని అర్హతలు ఉన్నాయని లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బీ ఎస్ చౌహాన్ వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ రంగం సంస్థగా గుర్తించి జవాబుదారి తనాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ప్రకటించారు.
ఇదే కనుక అమలైతే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి షాక్ తగినట్లుగానే భావించాల్సి ఉంది. కాగా ఈ సిఫారసులు ఆమోదం పొందితే... బీసీసీఐ పబ్లిక్ బాడీ అవుతుంది. దీంతో బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. అనంతరం ఈ చట్ట ప్రకారం దరఖాస్తు చేసి కావాల్సిన బీసీసీఐకి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని ప్రతి ఒక్కరు రాబట్టవచ్చు. ప్రస్తుతం బీసీసీఐ ప్రైవేటు సంస్థగా పని చేస్తోంది. ఇదిలా ఉండగా బీసీసీఐ ప్రభుత్వ పరిధిలోని రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.