Ind Vs Eng Semifinal: టీ20 వరల్డ్ కప్‌లో గురువారం టీమిండియా కీలక పోరుకు సిద్ధమవుతోంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం ప్రాక్జీస్ సెషన్‌లో రోహిత్ శర్మ గాయం కాస్త కలవరపెట్టినా.. తరువాత మళ్లీ నెట్స్‌లోకి రావడం ఉపశమనం కలిగించింది. మిగిలిన ప్లేయర్లు అందరూ ఫిట్‌గా ఉండడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బిగ్‌ ఫైట్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై చర్చ జరుగుతుండగా.. రోహిత్ శర్మ అండగా నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అక్షర్ పటేల్ గురించి తాను ఆందోళన చెందడం లేదని చెప్పాడు. అక్షర్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయలేదని.. సిడ్నీ మినహా అన్ని గ్రౌండ్స్ సీమర్స్‌కు సహకరించాయని అన్నాడు. అతనికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ ప్రపంచకప్‌లో అక్షర్ పటేల్‌కు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. వేసిన కొన్ని ఓవర్లలో కూడా అక్షర్ పెద్దగా రాణించనప్పటికీ.. ఈ యంగ్ ఆల్‌రౌండర్‌పై రోహిత్  నమ్మకం ఉంచాడు. సెమీస్‌ పోరులో అక్షర్‌కు తుదిజట్టులో చోటు కల్పిస్తున్నట్లు హింట్ ఇచ్చాడు.


సూర్యకుమార్ యాదవ్‌పై హిట్ మ్యాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య తన బాధ్యతను అర్థం చేసుకున్నాడన అన్నాడు.చాలా పరిణతి కనబరుస్తున్నాడని.. పెద్ద మైదానాలలో బాగా ఆడేందుకు ఇష్టపడతాడని చెప్పాడు. ఈ టోర్నీలో సూపర్ బ్యాటింగ్‌తో సూర్యకుమార్ యాదవ్ పేలుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుత T20 ప్రపంచ కప్‌లో 5 మ్యాచ్‌లలో 225 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.


టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్‌ను గెలుచుకోవడానికి టీమిండియా బలమైన పోటీదారుగా మారింది. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ తన ఏకైక టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఈ ట్రోఫీకి ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచి.. టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉండడంతో టైటిల్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also Read: IPL 2023: భారత ఆటగాళ్లను ఇతర లీగ్‌లలో ఆడనివ్వం.. కారణం చెప్పిన ఐపీఎల్ ఛైర్మన్‌!


Also Read: NZ vs PAK: నేడే న్యూజిలాండ్, పాకిస్థాన్ తొలి సెమీస్‌.. తుది జట్లు, రికార్డ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook