ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఉత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర క్రికెటర్ క్రిస్ లిన్‌ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) దక్కించుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడతాడని సందేహాలు మొదలయ్యాయి. క్రిస్ లిన్‌ను ఓపెనింగ్‌లో పంపించి రోహిత్ వన్‌డౌన్, లేక సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు  రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా ఐపీఎల్ 2020 సీజన్‌లో తాను ఓపెనర్‌గానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా తరఫున సైతం తాను ఓపెనర్‌గానే బరిలోకి దిగి విజయం సాధించానని, ప్రస్తుతం ముంబైకి సైతం అదే తీరుగా సేవలు అందించాలనుకున్నట్లు తెలిపాడు. జట్టు కోసం ఏ స్థానంలోనైనా సేవలు అందిస్తానని, కానీ అందుకు తప్పనిసరి పరిస్థితులు ఎదురవ్వాలని చెప్పాడు. గత సీజన్ తరహాలోనే క్వింటన్ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెడతానని మరోసారి స్పష్టం చేశాడు. మిడిలార్డర్‌లో ఆడటం వల్ల మరోసారి జట్టు కూర్పు దెబ్బతింటుందని, ప్రతికూల ఫలితాలు వస్తాయన్నాడు. అందులోనూ యూఏఈ వేదికగా ఐపీఎల్ కనుక ఓపెనింగ్‌లో వెళ్లి సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధమని రోహిత్ శర్మ తెలిపాడు. CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు


ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే సైతం ఇదే అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు. క్రిస్ లిన్ వచ్చినా, ఓపెనర్‌గా రోహిత్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. డికాక్, రోహిత్ శర్మ జోడీ సక్సెస్ అయిందని, ఓపెనర్లను మార్చే అవకాశం లేదన్నాడు. కాగా, అబు దాబి వేదికగా రేపు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తలపడుంది.    


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR