Ind Vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటికే సెమీస్‌లో దాదాపు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా.. ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే గ్రూప్‌-బి నుంచి టాప్‌ ప్లేస్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్.. మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లో ఉంది. ఒకవేళ జింబాబ్వేపై మ్యాచ్‌లో ఓడినా.. నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే పటిష్టమైన పాకిస్థాన్‌కు ఝలక్ ఇచ్చిన జింబాబ్వే.. టీమిండియాకు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లోకి రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆల్‌రౌంటర్ అక్షర్ పటేల్‌పైనే ఉంది. ఈ యంగ్ ప్లేయర్‌కు మూడు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చినా.. అటు బ్యాట్‌తో ఇటు బంతితో విఫలమయ్యాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 


ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అక్షర్ ఇప్పటివరకు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. పాకిస్థాన్‌పై 21 పరుగులిచ్చి వికెట్‌ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతడిని తప్పించారు. ఆ తర్వాత అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌పై బ్యాటింగ్‌లో అతని ఖాతా తెరవలేదు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.  


రేపు జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ స్థానంలో రిషబ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్స్ వస్తున్నాయి. బౌలింగ్‌లో హర్ధిక్ పాండ్యా ఐదో బౌలర్‌ పాత్రను పోషిస్తుండడంతో లెఫ్ట్ హ్యాండ్ స్పెషలిస్ట్‌గా పంత్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. అయితే సెమీస్‌కు ముందు కీలక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడకపోవచ్చు.  


Also Read: Virat Kohli Birthday Special: వెరైటీ ఫొటోలు షేర్ చేసిన అనుష్క శర్మ.. చూస్తే నవ్వు ఆపుకోలేరు  


Also Read: Twitter Layoffs: సినిమా స్టైల్లో ఎలెన్ మస్క్ మెయిల్.. దయచేసి ఇంటికి వెళ్లండి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి