Rohit Sharma Reacts After India Loss Vs SA: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్, జింబాబ్వే జట్లపై వరుసగా విజయాలతో జోరు మీదున్న భారత్‌కు దక్షిణాఫ్రికా కళ్లెం వేసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి పేస్ దాడికి భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్పా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరిపోయారు. బౌలింగ్‌లో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విజయంతో గ్రూప్-బిలో 5 పాయింట్లతో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ నిర్ణయం తప్పు అని మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే తేలిసిపోయింది. పేస్‌ స్వర్గధామం అయిన పెర్త్ పిచ్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లుంగి ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో భయపెట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని కూడా పెవిలియన్‌కు పంపించాడు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేయడంతో భారత్ పరువు నిలబడింది.


మ్యాచ్‌ అనంతరం రోహిత్ శర్మ టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పాడు. 'పిచ్‌లో ఏదో జరుగుతుందని మేము ఊహించాం. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ ఎంతగానో సహకరిస్తుందని మాకు తెలుసు. లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. అందుకే ముందు బ్యాటింగ్ చేశాం. కొన్ని పరుగులే చేసినా.. మేము మంచి పోరాటం చేశాం. కానీ ఈ రోజు దక్షిణాఫ్రికా వైపు ఉంది. 


ఐడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్ భాగస్వామ్యం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఫీల్డింగ్‌లో మేము చాలా పేలవంగా ఉన్నాం. ఫీల్డింగ్ వైఫల్యంతో దక్షిణాఫ్రికా కోలుకునేందుకు అవకాశాలు ఇచ్చాం. గత రెండు మ్యాచ్‌ల్లో మా ఫీల్డింగ్ బాగానే ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈ తప్పులు సరిదిద్దుకుని మిగిలిన మ్యాచ్‌లకు రెడీ అవుతాం..' అంటూ హిట్ మ్యాన్‌ చెప్పుకొచ్చాడు. 


డేవిడ్ మిల్లర్ (59 నాటౌట్), ఐడెన్ మార్క్‌రమ్ (52) అద్భుత అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


Also Read: Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ మతిపోయే అందాలు.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్న మలయాళ బ్యూటీ!


Also Read: Jordar Sujatha - Rocking Rakesh : జబర్దస్త్ జోడి బాగుందే.. రాకేష్‌ ఇంట్లోనే సుజాత ఉంటోందా?.. పిక్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook