Gym Rules: పిచ్చి పీక్స్‌కు చేరితే సరిగ్గా ఇలానే ఉంటుంది. ఆ జిమ్‌లో ఎంట్రీకు నిర్వాహకులు విధించిన నిబంధనలు మతి పోగొడుతున్నాయి. జిమ్ నిర్వాహకులకేమైనా పిచ్చెక్కిందా అనే కామెంట్లు విన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చండీగడ్‌(Chandigarh)లోని లేక్ క్లబ్ జిమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లబ్ యాజమాన్యంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఆ క్లబ్ యాజమాన్యం..జిమ్‌లో ప్రవేశానికి విధించిన నిబంధనలే. పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలానే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ జిమ్ యాజమాన్యం విధించిన నిబంధలు నిజంగానే చాలా వింతగా, విచిత్రంగా ఉన్నాయి.


జిమ్‌కు వచ్చేవారు వేసుకునే లో దుస్తులపై జిమ్ నిర్వాహకుల స్టాంప్ ఉండాలని..వాసన పరీక్ష చేయించుకోవాలని జిమ్ సభ్యులకు సూచిస్తోంది. జిమ్ సూట్లలోనే రావాలని..అనుమతిచ్చిన లో దుస్తులనే ధరించాలని నిబంధన పెట్టింది లేక్ క్లబ్(Lake Club Gym) యాజమాన్యం. సరైన బూట్లు ధరించాలని, పరిశుభ్రంగా ఉండాలని, సాక్స్ రోజుకోసారి మార్చాలని లేకపోతే జరిమానా విధిస్తామని షరతు పెట్టింది.స్మెల్ టెస్ట్‌లో ఫెయిలైతే చర్యలుంటాయట. జిమ్ పరిరకాల్ని శబ్దం రాకుండా చూడాలని, వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి శబ్దం రాకూడదని నిబంధనల్లో ఉంది. పంజాబీ తప్ప మరే ఇతర భాష మాట్లాడకూడదట. అనుమతించిన తిట్లు మాత్రమే తిట్టాలట. జిమ్‌కు షార్ట్స్ వేసుకుని వచ్చేవారు కాళ్లను షేవ్ చేసుకోవాలట. ఇలాంటి వింత విచిత్ర నిబంధనలు (Gym New Rules)పెట్టడంతో సోషల్ మీడియా(Social media)లో ట్రోలింగ్ ఎక్కువైంది. జిమ్‌కు రావాలంటే ఇన్నేసి రూల్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జిమ్ యాజమాన్యంపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 


Also read: 113 ఏళ్ల అనంతరం ఒలింపిక్స్‌లో అదే సన్నివేశం, ఇద్దరు విజేతలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook