113 ఏళ్ల అనంతరం ఒలింపిక్స్‌లో అదే సన్నివేశం, ఇద్దరు విజేతలు

Tokyo olympics: ఆటైనా..పాటైనా విజేత ఎక్కడైనా ఒక్కడే ఉంటాడు. సెకన్ల తేడా ఉన్నా అంతే. ఇద్దరు విజేతలనేది అసంభవమైన పరిస్థితి. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో అదే జరిగింది. అసాధ్యం సుసాధ్యమైన ఘటన.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2021, 12:33 PM IST
113 ఏళ్ల అనంతరం ఒలింపిక్స్‌లో అదే సన్నివేశం, ఇద్దరు విజేతలు

Tokyo olympics: ఆటైనా..పాటైనా విజేత ఎక్కడైనా ఒక్కడే ఉంటాడు. సెకన్ల తేడా ఉన్నా అంతే. ఇద్దరు విజేతలనేది అసంభవమైన పరిస్థితి. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో అదే జరిగింది. అసాధ్యం సుసాధ్యమైన ఘటన.

టోక్యో ఒలిపిక్స్‌(Tokyo Olympics)లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కనీవినీ ఎరుగుని రీతిలో ఒకే ఈవెంట్లో ఇద్దరు విజేతలయ్యారు. ఏం చేయాలో తెలియక..చివరికి చెరో బంగారు పతకాన్ని అందించారు. ఇది నిజంగానే అరుదైన ఘటన. ఒకే పోటీలో ఇద్దరు విన్నర్లనేది ఎక్కడా జరగని సన్నివేశం. పురుషుల హైజంప్(High Jump)ఈవెంట్‌లో జరిగిన ఘటన ఇది. ఖతార్‌కు చెందిన ఇసా ముతజ్ బార్షిమ్, ఇటలీకు చెందిన గ్లాన్‌మార్కో టంబెరిలు హైజంప్‌లో పోటీ పడ్డారు. ఇద్దరూ 2.37 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. అందుకే ఇద్దర్నీ విజేతలుగా ప్రకటించి చెరో బంగారు పతకాన్ని(Two Declared Gold Medals)అందించారు. విశేషమేమంటే మూడవ స్థానంలో నిలిచిన మాక్సిమ్ కూడా 2.37 మీటర్లు ఎత్తుకు జంప్ చేశాడు. అయితే అతని 8 ప్రయత్నాల్లో ఒక పౌల్ ఉండటంతో...ఆ ఫౌల్ ప్రాతిపదికగా కాంస్య పతకమిచ్చారు. 1908 ఒలింపిక్స్‌లో పోల్‌వాల్ట్‌లో కూడా బంగారు పతకాన్ని ఇద్దరు పంచుకున్నారు. అంటే 113 ఏళ్ల తరువాత మళ్లీ ఇదే.

Also read: పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ఫోటోస్ గ్యాలరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News