Cheteshwar Pujara hits his fastest century in Bangladesh vs India 1st Test: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌, నయా వాల్ చతేశ్వర్‌ పుజారా సెంచరీ కరువు తీరింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత శతకం బాదాడు. చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో 102 పరుగులు చేశాడు. పుజారా ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల తేడాతో సెంచరీ (90; 203 బంతుల్లో 11 ఫోర్లు) చేసే అవకాశాన్ని చేజార్చుకున్న పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ అవకాశాన్ని వదల్లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్‌ పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో తన శైలికి పూర్తి భిన్నంగా ఆడాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే.. ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే పుజారా తన కెరీర్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. 130 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న పుజారాకు ఇది టెస్టుల్లో 19వ శతకం. 2019 జనవరిలో సెంచరీ చేసిన పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత (1,443 రోజుల తర్వాత) బంగ్లాదేశ్‌పై సెంచరీ బాదాడు. బంగ్లా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు పడుతున్నా.. క్రీజులో నిలబడి 90 పరుగులు చేశాడు. 


పేలవ ఫామ్ కారణంగా చతేశ్వర్‌ పుజారా ఒకానొక దశలో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. అయినా కూడా ఎక్కడా నమ్మకం కోల్పోలేదు. ఫామ్‌లోకి రావడానికి యూకేలో కౌంటీల్లో ఆడాడు. సర్రే తరఫున వరుస మ్యాచ్‌లలో సెంచరీలు చేసి పూర్వపు ఫామ్ తెచ్చుకున్నాడు. దాంతో బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టెస్టులోనే తనెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. దాంతో పుజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


ఓవర్‌నైట్‌ స్కోరు 133/8తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ 150కే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/40) టెస్టు కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 254 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 258/2 వద్ద డిక్లేర్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (110; 152 బంతుల్లో 10×4, 3×6), చెతేశ్వర్‌ పుజారా (102 నాటౌట్‌; 130 బంతుల్లో 13×4) సత్తాచాటారు. 513 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన బంగ్లా 42/0తో ఆడుతోంది. నాలుగో రోజు ఆట నేడు మొదలుకానుంది. 


Also Read: Mancherial Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్ని ప్రమాదం.. 6 మంది సజీవదహనం! చుట్టం చూపుగా వచ్చి 


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజూ తగ్గిన పసిడి ధరలు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.