మెల్ బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పేసర్ కేన్ రిచర్డ్ సన్ కరోనా వైరస్ సంబంధిత లక్షణాలతో సతమవుతున్నాడు. దీంతో రిచర్డ్ సన్‌కు కోవిడ్19 (COVID-19) పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా టెస్టుల కారణంగా న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో ఆసీస్ జట్టుకు ఈ పేసర్ దూరం కానున్నాడు.  గొంతులో సమస్యగా ఉందని, కరోనా టెస్టులు చేయాలని టీమ్ మేనేజ్ మెంట్‌ను ఈ క్రికెటర్ కోరాడు. దీంతో టెస్టులు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం రిచర్డ్ సన్‌తో పాటు టీమ్ మేనేజ్ మెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హనీమూన్ నుంచి కరోనా వైరస్‌తో వచ్చిన టెకీ!


కేన్ రిచర్డ్ సన్ స్థానంలో మరో పేసర్ సీన్ అబాట్ ఆసీస్ తొలి వన్డే జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రిచర్డ్ సన్‌ను జట్టు ఇతర సభ్యులకు దూరంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా అనుమానితులను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4700 పైగా మరణాలు సంభవించగా, మరో 600 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.


ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!


ప్రపంచ వ్యాప్తంగా 1.3లక్షల మందిని చికిత్స అందిస్తున్నారు. కరోనా ప్రభావం ముఖ్యంగా క్రీడారంగంపై పడిందని చెప్పవచ్చు. జన సమూహాలు లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ ఇబ్బందికరమేనని టీమ్ మేనేజ్ మెంట్లు చెబుతున్నాయి. కోవిడ్19ను ఓ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ప్రకటించింది.


కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?


కరోనా వైరస్ మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..