కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?

కరోనా వైరస్ వణికిస్తోందని, దాని బారి నుంచి తప్పించుకునేందుకు హ్యాండ్ శానిటైజర్స్ వాడకం పెరిగింది. అయితే వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారో ఓ లుక్కేయండి.

Last Updated : Mar 6, 2020, 06:48 AM IST
కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?

ఆధునిక కాలంలో అన్ని ఉరుకులు పరుగుల మీద జరిగిపోవాలని భావిస్తుంటాం. పరిశుభ్రతపై శ్రద్ధ చూపే సమయం లేకపోవడం రోగాలకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. నిత్యం ఎంతో మందిని కలుస్తాం, ఆ సందర్బంగా వారికి షేక్ హ్యాండ్ ఇస్తాం. బస్సుల్లో, మెట్రోల్లో సీట్లకుండే హ్యాండిల్స్‌తో పాటు నిల్చున్నవారు కూడా  ఐరన్ రాడ్డులాంటి వాటి సాయం తీసుకుంటారు. 

వీటితో పాటు కరోనా వైరస్ (COVID-19) లాంటి వైరస్ సోకిన వారు పనిచేసే ప్రాంతాల్లో మనం చిరుతిళ్లు తినే అవకాశం ఉంది. ఆఫీసులో అయితే ఫిష్టులలో పనిచేసేవారు ఒకే సిస్టమ్‌పై గరిష్టంగా రోజుకు ముగ్గురి వరకు పనిచేస్తారు. ఈ క్రమంలో మనం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శానిటైజర్స్‌ను నిత్యం వినియోగించడం ఉత్తమం. నిత్యం మన చేతులతో మిలియన్ల కొద్దీ క్రిములు అలాగే ఉండిపోతాయి. కరోనా లాంటి వైరస్ ప్రబలుతున్న సమయంలో మాత్రమే వాడితే ఆ కొంత కాలం వరకే ఉపశమనం ఉంటుంది.

Also Read: మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ నిజాలు

శానిటైజర్స్ ఎందుకు...
సాధారణంగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలంటే నీళ్లు అవసరం. ఇందుకోసం ప్రత్యేకంగా బాత్రూమ్, వాష్ రూములకు వెళ్లాలి. అందుకే ముఖ్యంగా ఉద్యోగులు దీనిపై అంతగా ఆసక్తి చూపరు. కనుక శానిటైజర్స్ వాడితే ఈ సమస్య ఉండదు. మద్యం ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ వాడితే చేతులు శుభ్రం చేసుకునేందుకు నీళ్లు అక్కర్లేదు. వీటిలోని కొన్ని రసాయనలు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నీటి అవసరం లేకుండా ఉండే శానిటైజర్స్‌ను వాడటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read: మగవారిలో రొమ్ము క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఎంత పరిమాణం వాడాలి
సాధారణంగా ఒక్క బొట్టు వేసి చేతులు శుభ్రం చేద్దామని ఆలోచిస్తాం. కానీ అంతకుమించి పరిణామంలో శానిటైజర్‌ను వాడి చేతులను గోళ్లవరకు బాగా రుద్దాలి. అప్పుడే క్రిములు నశిస్తాయి. కొందరు శానిటైజర్ చేతిలో వేసుకుని ఫార్మాలిటీగా చేతులు రద్దుకుని శుభ్రం చేసుకున్నామని భావిస్తారు. కానీ క్రిములు ఇంకా అలాగే ఉండిపోతాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది. శానిటైజర్ ఆరేంత వరకు ఆగాలి. కానీ కొందరు వెంటనే కర్చీఫ్, ఇతర వస్త్రాలకు తుడిచేస్తుంటారు. కనీసం 30 సెకన్లపాటే వేటిని ముట్టుకోకుండా ఉండటం ఉత్తమం.

Also Read: మధ్యాహ్నం నిద్ర లాభమా.. నష్టమా? ఏం చేస్తే బెటర్

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News