St Kitts and Nevis Patriots win maiden CPL 2021 title: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(CPL-2021)లో కొత్త చాంపియన్‌గా సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌(St Kitts and Nevis Patriots) అవతరించింది. సెంట్‌ లూసియా, సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ మధ్య బుధవారం ఫైనల్‌ మ్యాచ్‌(Final Match) జరిగింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం అందుకున్న సెంట్‌ కిట్స్‌ తొలిసారి సీపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ విషయానికొస్తే..
ఇక మ్యాచ్‌ విషయాని​కి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన సెంట్‌ లూసియా కింగ్స్‌ (St. Lucia Kings)నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ కార్న్‌వాల్‌ 43, రోస్టన్‌ చేజ్‌ 43 రాణించారు. సెంట్‌ కిట్స్‌ బౌలర్లలో ఫాబియెన్‌ అలెన్‌ , నసీమ్‌ షా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్‌ కిట్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. గేల్‌(Gayle) డకౌట్‌గా వెనుదిరగ్గా.. కాసేపటికే ఎవిన్‌ లూయిస్‌ ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జోషుహ డిసిల్వా(37), షెర్ఫెన్‌ రూథర్‌ఫోర్డ్‌(25)లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విజయం దిశగా సాగిపోతున్న సమయంలో సెంట్‌ కిట్స్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది.


Also Read: Chris Gayle bat broken: క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలు చేసిన బౌలర్ Odean Smith


డ్రేక్స్‌ మ్యాజిక్..
ఈ దశలో డొమినిక్‌ డ్రేక్‌ అద్భుతం చేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో విజృంభించిన అతను చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. అతనికి ఫాబియెన్‌ అలెన్‌(20 పరుగులు) నుంచి చక్కని సహకారం లభించింది. ఫైనల్‌ హీరోగా నిలిచిన డొమినిక్‌ డ్రేక్స్(Dominic‌ Drakes) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. రోస్టన్‌ చేజ్‌(Roston Chase) ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును గెలుచుకున్నాడు.



పోలార్డ్ రికారును సమం చేసిన బ్రావో..
గత సీజన్‌లో 10 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న నేవీస్ పాట్రియట్స్ జట్టు, ఈ ఏడాది టైటిల్ విజేతగా నిలిచింది...గత సీజన్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన టైటిల్ అందించిన డీజే బ్రావో(DJ Bravo), ఈ ఏడాది కిట్స్ అండ్ నేవీస్ జట్టుకి కెప్టెన్‌గా మారి టైటిల్ అందించడం విశేషం. కెప్టెన్‌గా బ్రావోకి ఇది నాలుగో సీపీఎల్ టైటిల్ కాగా... ప్లేయర్‌గా తన కెరీర్‌లో 15వ టీ20 టైటిల్. అత్యధిక టీ20 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కిరన్ పోలార్డ్ రికార్డును సమం చేశాడు డీజే బ్రావో.


ఐపీఎల్‌(IPl)లో పంజాబ్ కింగ్స్ యజమానిగా టైటిల్ గెలవలేకపోయిన ప్రీతి జింటా(Preity Zinta), సీపీఎల్‌లోనూ టైటిల్ సాధించలేకపోయింది. ఫైనల్‌లో బ్రావో టీమ్ చేతుల్లో ఓడిన సెయింట్ లూసియా కింగ్స్‌కి ప్రీతి జింటాయే సహ యజమానిగా ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook