హెల్మెట్ పై జాతీయ జెండా చిహ్నం ఉంచుకోని ఏకైక క్రికెటర్ ధోనీ
ఎప్పుడైనా గమనించిరా.. ధోనీ హెల్మెట్ పై జాతీయ జెండా చిహ్నం ఉండదు. సచిన్ దగ్గరి నుంచి విరాట్ కోహ్లీ వరకు టీమిండియా క్రికెటర్లందరి హెల్మెట్లపై జాతీయ జెండా కనిపిస్తుంది. కానీ ఒక్క ధోనీ హెల్మెట్ పైనే జాతీయ జెండా చిహ్నం ఎందుకు ఉండదు అనే ప్రశ్న తలెత్తుంది కదూ. దీనికి కారణం ధోనీకి దేశభక్తి లేకపోవడమనుకుంటే పొరపాటే..
హెల్మెట్ పై ఇండియన్ ఫ్లాగ్ చిన్నం లేకపోవడానికి ఒక మంచి కారణం ఉందంటున్నాడు ధోనీ. కీపింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో హెల్మెట్ ను కింద పెట్టాల్సి వస్తుంది..రాజ్యాంగం ప్రకారం జాతీయ జెండాను కింద పెట్టడం పెద్ద తప్పు... నేరం కూడా. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధోనీ తన హెల్మెట్ పై జెండాను ఉంచుకోడట..వారేవ్వా ధోనీ ఈ దేశభక్తి..
ఇదిలా ఉండగా ధోనీ హెల్మెట్ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.