జైపూర్  వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ జట్టు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జోస్ బట్లర్ ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేసిన విధానంపై విమర్శలకు దారి తీసింది. ఈ మ్యాచ్ లో విజయం తొండి ఆటతోనే సాధ్యమైందని కామెంట్లు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఏం జరిగిందంటే రాజస్థాన్ లక్ష్యాన్ని చేధించే క్రమంలో జోస్ బట్లర్  దూకుడుగా ఆడుతు జట్టును విజయతీరాలను తీర్చే స్థితి లో నిలబెట్టాడు. 13వ ఓవర్ ను వేసిన అశ్విన్ అప్పటికే దాటిగా పరుగులు చేస్తూ తన జట్టును విజయతీరాల వైపు నడిపిస్తున్న బట్లర్ బట్లర్ ను 'మన్కడింగ్' చేసి ఔట్ చేశాడు. అశ్విన్ బంతిని వేయబోయే సమయానికి బట్లర్ క్రీజును దాటి బయటకు రాగా బాల్ వేయని అశ్విన్ బెయిల్స్ ను పడదోసి అపీల్ చేశాడు. థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో బట్లర్ ఆగ్రహంతో మైదానాన్ని వీడాడు. 


క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది అవుటే అయినప్పటికీ ఎంతో నిజాయితీ పరుడిగా పేరున్న అశ్విన్ ఎలాగైనా వికెట్‌ తీయాలన్న ఆలోచనలో 'మన్కడింగ్' చేశాడంటే నమ్మలేకున్నామని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. బట్లర్‌ క్రీజ్‌ దాటేవరకు వేచి చూడాలన్న ఉద్దేశం అశ్విన్ లో కనిపించిందని.. క్రీడా స్ఫూర్తికి ఇది మాయని మచ్చని అంటున్నారు. కొందరు ఫ్యాన్స్ అశ్విన్‌ తెలివిని ప్రశంసిస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.